Telugu Global
Telangana

వరంగల్ లో 10వ తరగతి ప్రశ్నా పత్రం లీక్ వెనక ప్రతిపక్ష నేత -కమిషనర్ వెల్లడి

కాగా, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామం నుంచి ప్రశ్నపత్రం లీక్ అయినట్లు సమాచారం. లీక్ తర్వాత, వరంగల్ జిల్లాలోని వాట్సాప్ గ్రూపులలో ఇది సర్క్యులేట్ అయ్యిందని తెలిసింది.

వరంగల్ లో 10వ తరగతి ప్రశ్నా పత్రం లీక్ వెనక ప్రతిపక్ష నేత -కమిషనర్ వెల్లడి
X

మంగళవారం జరిగిన హిందీ ఎస్‌ఎస్‌సి ప్రశ్నపత్రం లీక్‌పై పోలీసుల దర్యాప్తులో, ఆ ప్రశ్నా పత్రాన్ని ప్రతిపక్ష పార్టీనేత ఒకరు వాట్సప్ లో వైరల్ చేసినట్టు కనుగొన్నారు. ఆయన గతంలో ఓ న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా పని చేశారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఓ ప్రముఖ పత్రికకు తెలిపారు.

పరీక్ష ప్రారంభమైన 77 నిమిషాల తర్వాత ప్రశ్నపత్రం పరీక్ష హాల్ నుండి బయటకు వచ్చిందని కమిషనర్ చెప్పారు. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమైతే 10.47 గంటలకు ప్రశ్నపత్రం బయటకు వచ్చిందని, ప్రస్తుతం ఓ రాజకీయ పార్టీ కోసం పనిచేస్తున్న ఓ టీవీ ఛానెల్ మాజీ రిపోర్టర్‌కు ప్రశ్నపత్రం లభించిందని, ఆయనకు ఆ ప్రశ్నా పత్రం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అన్నారు.

కాగా, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామం నుంచి ప్రశ్నపత్రం లీక్ అయినట్లు సమాచారం. లీక్ తర్వాత, వరంగల్ జిల్లాలోని వాట్సాప్ గ్రూపులలో ఇది సర్క్యులేట్ అయ్యిందని తెలిసింది.

లీక్ అయిన ప్రశ్నపత్రం వరంగల్ జిల్లాకు చెందినదా లేదా హన్మకొండ జిల్లాకు చెందినదా అని తెలుసుకోవడానికి ప్రశ్నపత్రం మీద ఉండే కోడ్‌ను పరిశీలిస్తున్నామని, హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం నుండి ప్రశ్నపత్రం లీక్ అయి ఉంటుందని వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రవిణ్య అన్నారు.

కమలాపూర్ మండలం ఉప్పల్‌లోని జడ్పీఎస్‌ఎస్ బాలికల పాఠశాలను విద్యాశాఖ అధికారులు, పోలీసులు సందర్శించి విషయంపై ఆరా తీశారు.

కాగా, ఈ కేసులో పోలీసులు ఓ 16 ఏళ్ళ బాలుడిని అరెస్టు చేశారు. ఆ బాలుడు ఉప్పల్ లోని ఓ పరీక్ష కేంద్రంలోకి కిటికీ ద్వారా దూకి ఒకరి దగ్గర ప్రశ్నాపత్రాన్ని లాక్కొని పారిపోయాడు. దాన్ని ఫోటో తీసి వాట్సప్ లో షేర్ చేసినట్టు సమాచారం. మరో వైపు ఈ ప్రశ్నా పత్రాన్ని వాట్సప్ లో వైరల్ చేసిన రాజకీయ నాయకుడిని కూడా అరెస్టు చేసినట్టు సమాచారం.

First Published:  4 April 2023 7:19 PM IST
Next Story