Telugu Global
Telangana

ఆరోపణలు రుజువు చేస్తే ఉద్యోగం వదిలేసి వెళ్ళి పోతా... బండి సంజయ్ కి వరంగల్ పోలీసు కమిషనర్ సవాల్

వరంగల్ లో జరిగిన మీడియా సమావేశంలో రంగనాథ్ మాట్లాడుతూ, బిజెపిపై తప్పుడు కేసులు పెట్టడానికి తనకు రాజకీయ ఉద్దేశ్యం లేదని అన్నారు. తాను రాజకీయ బంధాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పనిచేస్తున్నాన‌ని, త‌న చిత్తశుద్ధి ప్రజలకు తెలుసన్నారు.విధుల్లో నిజాయితీగా ఉంటూ, కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం వల్లే తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చిందని రంగనాథ్ అన్నారు.

ఆరోపణలు రుజువు చేస్తే ఉద్యోగం వదిలేసి వెళ్ళి పోతా... బండి సంజయ్ కి వరంగల్ పోలీసు కమిషనర్ సవాల్
X

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్‌ పై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను అక్రమాలకు పాల్పడ్డానని సంజయ్ అంటున్నారు. ఆయన ఆ విషయాన్ని రుజువు చేస్తే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతానని ఏవీ రంగనాథ్ అన్నారు.

వరంగల్ లో జరిగిన మీడియా సమావేశంలో రంగనాథ్ మాట్లాడుతూ, బిజెపిపై తప్పుడు కేసులు పెట్టడానికి తనకు రాజకీయ ఉద్దేశ్యం లేదని అన్నారు. తాను రాజకీయ బంధాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పనిచేస్తున్నాన‌ని, త‌న చిత్తశుద్ధి ప్రజలకు తెలుసన్నారు.విధుల్లో నిజాయితీగా ఉంటూ, కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం వల్లే తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చిందని రంగనాథ్ అన్నారు.

‘నా గురించి ఖమ్మం, నల్గొండ జిల్లాల బీజేపీ కార్యకర్తలను అడిగితే తెలుస్తుంది. మా క‌ర్తవ్యాన్ని నెరవేర్చడం కోసమే మేము పనిచేస్తాం. మాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. బండి సంజయ్ కి నాకు గట్టు పంచాయితీ లేదు. లీక్ కేసులో కోర్టుకు సాక్ష్యాలు, ఆధారాలు సమర్పిస్తాం. బండి సంజయ్ ఫోన్ మా వద్దకు రాలేదు. ఆ రోజు రాత్రి 1.14 గంటలకు లాస్ట్ కాల్ ఉంది. ఫోన్ లాస్ట్ లొకేషన్ బెజ్జంకి అని చూపిస్తోంది. దీనికి సంబంధించి మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. బండి సంజయ్ కోపంగా ఉన్నట్టున్నారు... కావలంటే పరువునష్టం దావా వేసుకోవచ్చు. నేను మాత్రం పరువునష్టం దావా వేయను" అని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు.

కేసుల్లో నిందితులుగా ఉన్నవాళ్లు దర్యాప్తును తప్పుబట్టడం సాధారణం అని వ్యాఖ్యానించారు. గతంలో చేయని ఆరోపణలు ఇప్పుడెందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. హిందీ పేపర్ లీక్ దర్యాప్తును రాజకీయ కోణంలో చూడొద్దని హితవు పలికారు.

First Published:  11 April 2023 8:01 PM IST
Next Story