గ్రేటర్‌లో కోటి దాటిన ఓటర్ల సంఖ్య.. తెలంగాణలో 30 శాతం ఇక్కడే.!
హైదరాబాద్ జిల్లా పరిధిలో 45 లక్షల ఓటర్లు ఉండగా.. రంగారెడ్డి జిల్లా పరిధిలో 31 లక్షలు, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా పరిధిలో 28 లక్షల 75 వేల ఓటర్లు ఉన్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటర్ల సంఖ్య ఫస్ట్ టైమ్ కోటి దాటింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో కోటి 5 వేల మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణలోని మొత్తం ఓటర్లలో 30 శాతం ఓటర్లు గ్రేటర్ పరిధిలోనే ఉన్నారు.
మొత్తం 26 నియోజకవర్గాల్లో గ్రేటర్ హైదరాబాద్ విస్తరించి ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు గ్రేటర్ పరిధి విస్తరించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో గ్రేటర్ పరిధిలో 99 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య కోటి దాటింది. ఇక గడిచిన ఐదేళ్లలో దాదాపు 15 లక్షల ఓటర్లు వచ్చి చేరారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో 45 లక్షల ఓటర్లు ఉండగా.. రంగారెడ్డి జిల్లా పరిధిలో 31 లక్షలు, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా పరిధిలో 28 లక్షల 75 వేల ఓటర్లు ఉన్నారు. ఇక నియోజకవర్గాల పరంగా శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7 లక్షల 47 వేల మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా చార్మినార్ పరిధిలో 2 లక్షల 28 వేల మంది ఓటర్లు ఉన్నారు.