Telugu Global
Telangana

ఓట్ ఫ్రమ్ హోమ్.. సిద్ధిపేట టాప్

ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 28,057 మంది ఓటర్లు ఓట్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని వినియోగించుకోబోతున్నారు. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్న 28,057 మందికి ఈసీ అవకాశం కల్పించింది.

ఓట్ ఫ్రమ్ హోమ్.. సిద్ధిపేట టాప్
X

ఈ ఏడాది తెలంగాణ ఎన్నికల్లో ఓట్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరగబోతోంది. ఇప్పటి వరకూ కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికల సమయంలో ప్రయోగాత్మకంగా ఇంటినుంచి ఓటు వేసే పద్ధతి ప్రవేశపెట్టారు. ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ ఫ్రమ్ హోమ్ అధికారికంగా మారింది. తెలంగాణలో మొత్తంగా 28,057 మంది ఓటర్లు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయాన్ని ఉపయోగించుకోబోతున్నారు.

వృద్ధులు, వికలాంగులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో మంచం దిగలేనివారికి ఇంటి వద్దనుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం కొత్త నియమాలు తీసుకొచ్చింది. దీనికోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి వద్దనుంచి ఓటు వేసే సమయంలో ఆ ప్రక్రియనంతా వీడియో రికార్డింగ్ చేసి భద్రపరుస్తారు. ఇలా ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 28,057 మంది ఓటర్లు ఓట్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని వినియోగించుకోబోతున్నారు. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్న 28,057 మందికి ఈసీ అవకాశం కల్పించింది. వీరంతా ఓటు వేసే తేదీని ముందుగానే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నిర్ణయిస్తారు.

ఇంటి వద్దనుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నవారు ఎక్కువగా సిద్ధిపేట నుంచి ఉన్నారు. అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో 757 మంది, బాల్కొండ 707, సత్తుపల్లి 706, పెద్దపల్లి 640 మందికి ఇంటినుంచి ఓటువేసే అవకాశం కల్పించింది ఈసీ. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇలాంటివారు ఉన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలు 35,356

వెబ్‌ క్యాస్టింగ్‌ ఉన్న కేంద్రాలు 27,798

మహిళా పోలింగ్‌ కేంద్రాలు 597

మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు 644

దివ్యాంగ కేంద్రాలు 120

మొత్తం ఓటర్లు 3.26 కోట్లు

తొలిసారి ఓటు హక్కు వచ్చినవారు 9,99,667

First Published:  17 Nov 2023 10:32 AM IST
Next Story