Telugu Global
Andhra Pradesh

కడప ఎస్పీని కలిసిన వివేకా కుమార్తె వైఎస్ సునీత

తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో సుదీర్ఘకాలంగా న్యాయం కోసం పోరాడుతున్న సునీతా నేడు కడప ఎస్పీ విద్యాసాగర్‌ను కలిశారు.

కడప ఎస్పీని కలిసిన వివేకా కుమార్తె వైఎస్ సునీత
X

వైఎస్ఆర్ కడప ఎస్పీ విద్యాసాగర్‌ను వైఎస్ వివేకా కుమార్తె సునీత కలిశారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు గురించి ఎస్పీకి వివరించారు. వివేకా హంతకులకు శిక్ష పడేలా పోలీసులు కూడా సహకరించాలని కోరారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి అభ్యంతరకర పోస్టులపైనా సునీత ఎస్పీతో చర్చించారు. అనంతరం, కడప నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. విద్యాసాగర్ కు ముందు కడప ఎస్పీగా వ్యవహరించిన హర్షవర్ధన్ రాజును కూడా సునీత గత ఆగస్టులో కలిశారు.

మొదట హోంమంత్రి అనితను కలిసిన అనంతరం, సునీత అప్పటి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి తండ్రి మర్డర్ అంశంపై మాట్లాడారు. కాగా, హోంమంత్రి అనితను కలిసిన సమయంలో... వివేకా హంతకులకు స్థానిక పోలీసుల అండ లభిస్తోందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ విచారణకు పోలీసుల సహకరించేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

First Published:  15 Nov 2024 4:52 PM IST
Next Story