Telugu Global
Telangana

కాంగ్రెస్‌కి వివేక్ రాజీనామా చేసి వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలో చేరాలి : కృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడేది మాలల్లో ఉండే కొందరు స్వార్ధపరులు అని ఆ స్వార్థపరులే మనువాదులు అని మ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.

కాంగ్రెస్‌కి  వివేక్ రాజీనామా చేసి వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలో చేరాలి : కృష్ణ మాదిగ
X

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఎస్సీ వర్గీకరణకు అడ్డుకునే శక్తి ఉంటే.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలో చేరాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. నిన్న సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాలల సింహగర్జన కార్యక్రమంపై మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడేది మాలల్లో ఉండే కొందరు స్వార్ధపరులు అని విమర్శించారు. ఆ స్వార్థపరులే మనువాదులు అని కృష్ణ మాదిగ మండిపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత కాలం దళితుల విముక్తి కోసం పాటుపడ్డారని వివరించారు.

అయితే ఆయన లేని సమయంలో ఆయన స్పూర్తిని కొనసాగించాల్సిన దళిత వర్గాలు.. ఆ దళిత వర్గాల్లో ఎదిగిన మాల వర్గం ఆయన స్పూర్తికి భిన్నంగా.. సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ముందుకు నడుస్తున్నారని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతుంటే స్వార్థపరులైన మాలలు వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. మాలలు అంబేడ్కర్ వారసులు కాదని, అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారని ఆరోపించారు. మనువాదుల సంఖ్య మాలల్లో పెరిగిందన్నారు. దళితుల్లో ఎదిగిన వర్గం మిగిలిన వర్గాల హక్కులను హరించడానికి కుట్రలు చేస్తున్నప్పుడు వారు అంబేడ్కర్ వ్యతిరేకులేనని మందకృష్ణ మాదిగ అన్నారు.

First Published:  2 Dec 2024 4:47 PM IST
Next Story