హైకోర్టు షరతుల ఉల్లంఘన: రాజా సింగ్‌కు మళ్ళీ నోటీసులు జారీ చేసిన పోలీసులు
రాజా సింగ్ కు జారీ చేసిన నోటీసులో "గౌరవనీయమైన హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించి, నిర్దిష్ట కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని మీరు అభ్యంతరకరమైన శీర్షికతో ఫోటోను పోస్ట్ చేసారు" అని పోలీసులు పేర్కొన్నారు.
గోషామహల్ శాసనసభ్యుడు టి రాజా సింగ్ కు హైదరాబాద్ పోలీసులు మళ్ళీ నోటీసులు జారీ చాశారు. మంగళవారం బాబ్రీ మసీదు కూల్చివేత 30వ వార్షికోత్సవం నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని కించపర్చే, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై రాజా సింగ్‌కు మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
రాజా సింగ్ కు జారీ చేసిన నోటీసులో "గౌరవనీయమైన హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించి, నిర్దిష్ట కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని మీరు అభ్యంతరకరమైన శీర్షికతో ఫోటోను పోస్ట్ చేసారు" అని పోలీసులు పేర్కొన్నారు.
రెండు రోజుల్లోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు కోరారు.
రాజాసింగ్ పై ఉన్న పీడీ యాక్ట్‌ను హైకోర్టు ఇటీవల రద్దు చేసి అతన్ని జైలు నుండి విడుదల చేసిన విషయం తెలిసిందే . ఏ మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, లేదా సోషల్ మీడియాలో అటువంటి విషయాలను పోస్ట్ చేయడం మానుకోవాలని రాజాసింగ్ కు హైకోర్టు షరతులు విధించింది. .