డైలమాలో విజయశాంతి.. పార్టీలో ఉంటారా.. వెళ్తారా.?
విజయశాంతి ఏం చెప్పదలుచుకుంటున్నారనేది ఎవరికీ అర్థం కావట్లేదు. బీజేపీలోనే ఉంటారా.. లేదా హస్తం గూటికి చేరతారా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
బీజేపీ నేత విజయశాంతి డైలమాలో ఉన్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. బీజేపీ తీరుతో అసంతృప్తిగా ఉన్న విజయశాంతి.. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆమె ప్రత్యక్షంగా ఎక్కడా ఖండించలేదు.
ఇక రోజుకో ట్వీట్‌తో వార్తల్లో ఉంటూ వస్తున్నారు విజయశాంతి. రెండు రోజుల క్రితం ఇలాంటి ట్వీటే చేశారు. కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు కొందరు కాంగ్రెస్‌లో చేరాలని కోరుతున్నారని.. మరికొందరు బీజేపీలో ఉండమంటున్నారని ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. అయితే ఇద్దరి అభిప్రాయం తెలంగాణ మేలు కోసమేనని.. సినిమాల్లో లాగా రాజకీయాల్లో డబుల్ యాక్షన్ కుదరదని ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ దుర్మార్గాల నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోనీకి కాంగ్రెస్ నుండి పోరాడాలి...
— VIJAYASHANTHI (@vijayashanthi_m) November 1, 2023
7 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా మోసిన వ్యక్తి రాములమ్మ అని కొందరు..
బీజేపీని విధాన పూర్వకంగా 1998 నుండి విశ్వసించి దక్షిణ భారతంతో పాటు మిగతా అనేక రాష్ట్రాలలో దశాబ్ధ కాలం… pic.twitter.com/7S9GdxV6d4
విజయశాంతి ఏం చెప్పదలుచుకుంటున్నారనేది ఎవరికీ అర్థం కావట్లేదు. బీజేపీలోనే ఉంటారా.. లేదా హస్తం గూటికి చేరతారా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఇప్పటివరకూ బీజేపీ 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మూడు జాబితాల్లోనూ విజయశాంతి పేరు కనిపించలేదు. మరోవైపు చాలా మంది బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చెప్తున్న లిస్ట్‌లో విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాములమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.