Telugu Global
Telangana

పోలీసులను ఆశ్రయించిన విజయ్‌ దేవరకొండ

"ఫ్యామిలీస్టార్‌"పై ప్రేక్షకుల స్పందన ఒకలా ఉంటే, సోషల్‌మీడియాలో మరోలా ట్రోల్‌ చేస్తున్నారంటూ సినిమా ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులను ఆశ్రయించిన విజయ్‌ దేవరకొండ
X

విజయ్‌ దేవరకొండ హీరోగా, పరశురామ్‌ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా "ఫ్యామిలీస్టార్‌ష‌. ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలో "ఫ్యామిలీస్టార్‌" గురించి దుష్ప్రచారం చేస్తున్న వారిపై విజయ్‌ దేవరకొండ టీమ్‌ మాదాపూర్ పీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ వింగ్‌లో ఫిర్యాదు చేసింది. కావాలనే సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ కామెంట్స్‌ స్ప్రెడ్ చేస్తున్నారని విజయ్‌ టీమ్‌ తెలిపింది. పోస్టులకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పోలీసులకు ఇచ్చింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది.

"ఫ్యామిలీస్టార్‌"పై ప్రేక్షకుల స్పందన ఒకలా ఉంటే, సోషల్‌మీడియాలో మరోలా ట్రోల్‌ చేస్తున్నారంటూ సినిమా ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. నెగెటివ్‌ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదన్నారు. మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం బాలేదన్నారు. "సినిమా చూసిన కుటుంబ ప్రేక్షకులు బాగుందని అంటున్నారు. చాలా మంది మూవీ తమకు నచ్చిందని ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారు. మరికొందరేమో సినిమాకు ఎందుకలా నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నారని అడుగుతున్నారు. రిలీజ్‌ కాకముందు నుంచే ఇలాంటి ప్రచారం మొదలు పెట్టారని చెబుతున్నారు".

"కేరళలో సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు రివ్యూలు, రేటింగ్‌లు ఇవ్వకూడదంటూ కోర్టు తీర్పు ఇచ్చిందట. అలాంటిదేదో వస్తే కానీ ఇండస్ట్రీ బాగుపడదు. నెగెటివ్‌ రివ్యూల వల్ల ఎవరెవరిపై ప్రభావం చూపుతుందో ఎవరూ చూడటం లేదు. నెగెటివ్‌ ప్రచారం వల్ల కష్టపడి సినిమా తీసిన నిర్మాతలు నష్టపోతున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత నష్టం చేకూరుస్తుంది. సినిమాలు తీయాలన్న ఆలోచన కూడా రాదు. దానివల్ల చాలా మార్పులు వస్తాయి. ఒకవేళ సినిమా బాలేకపోతే అది మీ అభిప్రాయం. దాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఎత్తి చూపుతూ ప్రేక్షకులపై రుద్దడం సరికాదు’’ అని దిల్‌రాజు అన్నారు.

First Published:  8 April 2024 5:38 AM GMT
Next Story