Telugu Global
Telangana

ఉస్మానియా, గాంధీకి పోతే సచ్చిపోతరు.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్ వీడియో వైరల్‌

హైదరాబాద్‌ నగరంలో గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ ప్రధానమైన ప్రభుత్వ హాస్పిటల్స్. జిల్లాల నుంచి కూడా ఈ హాస్పిటల్స్‌కు పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు.

ఉస్మానియా, గాంధీకి పోతే సచ్చిపోతరు.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్ వీడియో వైరల్‌
X

ఉస్మానియా, గాంధీ హాస్పిటల్‌కు పోతే సచ్చిపోతరు. గాంధీ, ఉస్మానియాకు వద్దు. మనం పోతమా, నువ్వు పోతవా గాంధీ, ఉస్మానియాకు.?..ఈ మాటలు అన్నది ఎవరో కాదు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌. ఓ ఫోన్‌ కాల్‌లో మాట్లాడుతూ.. అవతలి వారితో ఆయన చెప్పిన మాటలు ఇవి.


ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి.. ప్రభుత్వ హాస్పిటల్స్‌పై నమ్మకం పెంచాల్సింది పోయి.. ఇలా మాట్లాడడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌ నగరంలో గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ ప్రధానమైన ప్రభుత్వ హాస్పిటల్స్. జిల్లాల నుంచి కూడా ఈ హాస్పిటల్స్‌కు పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు. సాక్షాత్తు స్పీకర్ స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడంతో ఈ హాస్పిటల్స్‌పై ప్రభుత్వాలకు ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవచ్చని విమర్శలు వస్తున్నాయి.

First Published:  14 March 2024 5:17 AM GMT
Next Story