ఈటలకు షాక్.. తుల ఉమకు బీ ఫామ్ క్యాన్సిల్
తుల ఉమకు టికెట్ ఇప్పించడంలో ఈటల రాజేందర్ సక్సెస్ అయ్యారని అనుకున్నా, చివరకు బండి సంజయ్ ఈటలపై పైచేయి సాధించినట్టయింది. బండి సంజయ్ సపోర్ట్ తోపాటు, మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ తన కొడుకు వికాస్ రావుకి బీ ఫామ్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.
వేములవాడ బీజేపీ టికెట్ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇది. చివరి నిమిషంలో అభ్యర్థిని ఆ పార్టీ మార్చేసింది. ముందుగా తుల ఉమకు టికెట్ అంటూ జాబితాలో ఆమె పేరు ప్రకటించినా, చివరకు ఆమెకు అధిష్టానం హ్యాండిచ్చింది. చెన్నమనేని వికాస్ రావుకి బీ ఫామ్ ఇచ్చింది. దీంతో వేములవాడ బీజేపీ నిట్టనిలువునా చీలినట్టయింది.
ఈటల వర్సెస్ బండి..
తుల ఉమకు టికెట్ ఇప్పించడంలో ఈటల రాజేందర్ సక్సెస్ అయ్యారని అనుకున్నా, చివరకు బండి సంజయ్ ఈటలపై పైచేయి సాధించినట్టయింది. బండి సంజయ్ సపోర్ట్ తోపాటు, మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ తన కొడుకు వికాస్ రావుకి బీ ఫామ్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. తీవ్ర ఉత్కంఠ మధ్య బీ ఫామ్ ని వికాస్ రావుకి ఇచ్చింది బీజేపీ అధిష్టానం. దీంతో బండి వర్గం సంబరాలు చేసుకుంటోంది.
పోటాపోటీగా నామినేషన్లు..
వేములవాడకు తుల ఉమ అభ్యర్థిత్వం ముందుగానే ఖరారైనా ఆమెకు బీ ఫామ్ మాత్రం ఇవ్వలేదు. దీంతో తుల ఉమతోపాటు, వికాస్ రావు కూడా నామినేషన్ వేశారు. వీరిద్దరిలో ఎవరికి బీ ఫామ్ ఇస్తే వారే బీజేపీ అధికారిక అభ్యర్థి. ఇప్పుడా అవకాశం వికాస్ రావుకి లభించింది. తుల ఉమ తన నామినేషన్ ని ఉపసంహరించుకుని బీజేపీ అభ్యర్థికి సహకరిస్తారా, లేక రెబల్ గా తాను కూడా పోటీ చేస్తారా..? అనేది తేలాల్సి ఉంది.
♦