తెలంగాణలో గెలుపు కోసం.. బీజేపీ చివరి ప్రయత్నం
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చేసే మార్పులేవో పోలింగ్‌కు ముందే చేస్తే ఏమోలే వాస్తు ప్రకారం మార్పులు చేస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయేమో అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఓటర్ తీర్పు అయిపోయింది.
తెలంగాణ బీజేపీ నేతల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. ఎన్నికలు జరిగిపోయి ఆదివారం ఓట్ల లెక్కింపు జరగబోయే ముందు పార్టీ ఆఫీసుకు వాస్తును మార్చుకున్నారు. వాస్తు మార్పులు చేస్తే అధికారంలోకి రావటం ఖాయమని ఎవరో వాస్తు పండితుడు సలహా ఇచ్చినట్లున్నారు. అందుకనే అర్జంట్‌గా శనివారం తూర్పు ద్వారాన్ని మూసేసి ఉత్తర ద్వారాన్ని తెరిచారు. నాంపల్లిలో పార్టీ స్టేట్ ఆఫీసు ఉన్న విషయం తెలిసిందే. ఇంతకాలం ఆఫీసు ముఖద్వారం తూర్పుకే ఉంది.
అలాంటిది పోలింగ్ ముగిసి అందరు ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో సడెన్ గా వాస్తు మార్పులు చేశారు. అదేమిటంటే శుక్రవారం వరకు పార్టీ ఆఫీసులోకి అందరు తూర్పు ముఖంలోని ద్వారంగుండానే రాకపోకలు సాగించేవారు. అలాంటిది ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ హఠాత్తుగా తూర్పు ద్వారాన్ని మూసేసి ఉత్తర ద్వారాన్ని తెరిచారు. ఇప్పుడు నేతలంతా ఉత్తర ద్వారంలో నుండే రాకపోకలు సాగిస్తున్నారు. ఎందుకిలా చేశారంటే వాస్తు మార్పులు చేస్తే కలిసొస్తుందని వాస్తు పండితుడు ఎవరో చెప్పారని తెలిసింది.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చేసే మార్పులేవో పోలింగ్‌కు ముందే చేస్తే ఏమోలే వాస్తు ప్రకారం మార్పులు చేస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయేమో అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఓటర్ తీర్పు అయిపోయింది. ఆ తీర్పు ఏమిటన్నదే ఆదివారం బయటపడుతుంది. తీర్పు ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాస్తు మార్పులు చేస్తే ఏమిటి ఉపయోగం అన్నదే ఎవరికీ అర్థంకావటంలేదు. ఇప్పుడు వాస్తు ప్రకారం మార్పులు చేసినంత మాత్రాన ఇచ్చేసిన ఓటరు తీర్పు మారదు కదా.
మరీ విషయం తెలియకుండానే వాస్తు ప్రకారం ఒక ద్వారాన్ని మూసేసి మరో ద్వారాన్ని తెరిచారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా ఫలితాలు వెలువడే ఒకటిన్నర రోజు ముందు పార్టీ ఆఫీసుకు వాస్తు మార్పులు చేయించటం నేతల్లోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి దీని ప్రభావం ఫలితాలపై ఏ విధంగా ఉండబోతోందో చూడాల్సిందే. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రాజకీయాల్లో వాస్తులు, జ్యోతిష్యాల ప్రభావం ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తోందో అర్థమవుతోంది.