రుణమాఫీ కాలేదా.. ఇలా చేయండి
రేషన్‌కార్డులో లబ్ధిదారుల వివరాలు అప్‌గ్రేడ్ కాకపోవడం వల్ల కూడా కొందరు లబ్ధిదారుల్ని పెండింగ్‌లో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం జూలై 18న రూ. లక్ష వరకు రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హులైన 11లక్షల 50వేల మంది రైతులకు రూ. 6,098 కోట్లు జమ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, రేషన్ కార్డు ఉన్నవాళ్లకే రూ. లక్షలోపు రుణమాఫీ చేశారనే ప్రచారం జరుగుతోంది. రుణమాఫీ అయిన వాళ్లలో 90శాతం మంది రేషన్‌కార్డు ఉన్నవాళ్లే ఉన్నారని తెలుస్తోంది. దీంతో అర్హత ఉండి కూడా రుణమాఫీ అమలు కాని రైతులు చాలామందే ఉన్నారనే చర్చ జరుగుతోంది.
రేషన్‌కార్డు అప్‌గ్రేడ్ కాకుంటే..
రేషన్‌కార్డులో లబ్ధిదారుల వివరాలు అప్‌గ్రేడ్ కాకపోవడం వల్ల కూడా కొందరు లబ్ధిదారుల్ని పెండింగ్‌లో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు ఉంటే పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని అంటున్నారు.
రుణమాఫీ కాకపోతే ఇలా చేయండి..
♦ ఆధార్ కార్డు తీసుకొని మండల వ్యవసాయ అధికారి ఆఫీసుకు వెళ్లండి.
♦ మీకు రుణమాఫీ సొమ్ము ఎందుకు రాలేదో వెంటనే చెక్ చేసి చెప్తారు.
♦ అధికారిక ఐటీ పోర్టల్‌లో కూడా మీ సమస్య చెప్పుకోవచ్చు.
♦ ప్రతి జిల్లాలో టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది.
♦ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోండి.
♦ లోన్ తీసుకున్న బ్యాంకును కూడా ఓసారి సంప్రదించండి.
♦ సాంకేతిక సమస్యలు ఉంటే బ్యాంకు వాళ్లు పరిష్కరిస్తారు.
రుణమాఫీకి కటాఫ్ డేట్‌గా 12-12-2018 నుంచి 09-12-2023ను తీసుకున్నారు. అకౌంట్లు క్లోజ్ చేసుకున్న వారికి, బంగారం లోన్లు తీసుకున్న వారికి రుణమాఫీ వర్తించదు.