అర్బన్ ఓటరు బద్దకం వీడేనా..?
గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. 2018 ఎన్నికల్లో 45 నుంచి 60 శాతం మధ్యలోనే ఆ నియోజకవర్గాల్లో ఓటింగ్ నమోదైంది. ఒక్క పటాన్ చెరులో మాత్రమే ఓటింగ్ 60 శాతం దాటింది. అర్బన్ లో ఓటింగ్ ఎంత దారుణంగా ఉందో ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది.
2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనిష్ట పోలింగ్ శాతం
యూకుత్ పుర - 42శాతం
మలక్ పేట - 42శాతం
జూబ్లీ హిల్స్ - 45శాతం
గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. 2018 ఎన్నికల్లో 45నుంచి 60శాతం మధ్యలోనే ఆ నియోజకవర్గాల్లో ఓటింగ్ నమోదైంది. ఒక్క పటాన్ చెరులో మాత్రమే ఓటింగ్ 60శాతం దాటింది. అర్బన్ లో ఓటింగ్ ఎంత దారుణంగా ఉందో ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓటు హక్కు ఉన్న 100మందిలో కనీసం 45మంది కూడా పోలింగ్ రోజు బయటకు రాకపోవడం విశేషం.
లెక్చర్లు దంచేవాళ్లే కానీ క్యూలో నిలబడేవారేరి..?
అర్బన్ ఓటర్లలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఓటు హక్కు వినియోగంపై వాట్సప్ స్టేటస్ లు, సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతుంటారు. కానీ తీరా ఓటింగ్ రోజు మాత్రం అర్బన్ ఓటరు ఇల్లు దాటి బయటకు రాడు అనే అపవాదు ఉంది. దీనికి నిదర్శనం పోలింగ్ శాతమే. ఆ రోజు మీడియాలో సోషల్ మీడియాలో.. ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించేవారు కూడా ఇంటి బయటకు వచ్చి పోలింగ్ బూత్ కి దారి తీయరు. అందుకే గ్రేటర్ పరిధిలో ఓటింగ్ శాతం దారుణంగా ఉంది.
ఇక గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ శాతం ఎక్కువగా కనపడుతోంది. పట్టణాల్లో ఉన్నవారు కూడా తమ సొంత ఊళ్లకు వెళ్లి ఓటు వేసి వస్తుంటారు. పట్టణంలో నివసిస్తూ ఇక్కడే ఓటు ఉన్నవారు మాత్రం కనీసం పోలింగ్ బూత్ వరకు కూడా వెళ్లరు. గ్రామీణ నియోజకవర్గాల్లో 2018 ఎన్నికల్లో మధిరలో 92 శాతం పోలింగ్ నమోదైంది. పాలేరులో కూడా 92శాతం పోలింగ్ జరిగింది. మునుగోడులో 91శాతం, భువనగిరిలో 90శాతం, వైరా, సత్తుపల్లి, కోదాడలో 89శాతం పోలింగ్ జరిగింది. పట్టణాలతో పోల్చి చూస్తే పల్లెటూళ్లలోనే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు పోటెత్తుతారు. తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారు.
♦