Telugu Global
Telangana

కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గ‌ద్దె దింపాలంటే విప‌క్షాల‌న్నీ ఏకం కావాల‌ని అన్నారు సమాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. బీజేపీ వ్య‌తిరేకుల‌ను క‌లుపుకొని వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ
X

తెలంగాణ సీఎం కేసీఆర్ తో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. కాసేపటి క్రితం ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట్‌ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడినుంచి నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ కు వెళ్లారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ లో సీఎం కేసీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు.. అఖిలేష్ యాదవ్ కు సాదర స్వాగతం పలికారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఇద్దరు నేతలు చ‌ర్చిస్తున్నారు.


కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గ‌ద్దె దింపాలంటే విప‌క్షాల‌న్నీ ఏకం కావాల‌ని అన్నారు సమాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. బీజేపీ వ్య‌తిరేకుల‌ను క‌లుపుకొని వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. విప‌క్షాల పోరాటంపై కేసీఆర్‌ తో చ‌ర్చించేందుకు వ‌చ్చాన‌ని ఆయన చెప్పారు. తమ అంద‌రి ల‌క్ష్యం బీజేపీని అధికారం నుంచి దించ‌డ‌మేనని స్ప‌ష్టం చేశారు.

అటు కాంగ్రెస్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ విపక్షాల లిస్ట్ లో సమాజ్ వాదీ పార్టీ కూడా ఉంది. పాట్నా మీటింగ్ కి కూడా అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ఆ తర్వాత బెెంగళూరులో జరగాల్సిన రెండో మీటింగ్ అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ కూటమిలో ప్రస్తుతం బీఆర్ఎస్ లేదు. తాము బీజేపీ, కాంగ్రెస్ కి సమదూరంగా ఉన్నట్టు ఇప్పటికే బీఆర్ఎస్ స్పష్టం చేసింది. రెండు పార్టీలు దేశాన్ని అభివృద్ధిలో వెనక్కు నెట్టాయని, వాటికి ప్రత్యామ్నాయం రావాలనేది బీఆర్ఎస్ ఆశయం. ఈ దశలో సీఎం కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ ఆసక్తికరంగా మారింది.

First Published:  3 July 2023 9:20 AM GMT
Next Story