Telugu Global
Telangana

మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి అనూహ్య స్పందన

208 మంది తమ సమస్యలను నేరుగా మంత్రి దామోదర రాజనర్సింహకు వివరించగా..దాదాపు 30 సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం

మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి అనూహ్య స్పందన
X

గాంధీభవన్‌లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమానికి మొదటిరోజు అనూహ్య స్పందన వచ్చింది. పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తరలివచ్చారు. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో 208 మంది తమ సమస్యలను నేరుగా మంత్రి దామోదన రాజనర్సింహకు వివరించారు. దాదాపు 30 సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించిన మంత్రి మిగిలిన వాటిని ఆయా శాఖలకు పంపించారు. వినతులు అందించిన వారు తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం, శుక్రవారం ప్రజావాణికి వెళ్లి తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించామని పలువురు తెలిపారు. ఇవాళ మంత్రి వస్తున్నారని తెలిసి ఇక్కడి వచ్చామని మా సమస్యలను వారి దృష్టి తీసుకొచ్చామని ఆయన సానుకూలంగా స్పందిచినట్లు చెప్పారు.

First Published:  26 Sept 2024 9:45 AM IST
Next Story