Telugu Global
Telangana

హైడ్రాపై సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలని.. కానీ మీరు కూల్చివేతలతో పేరుతెచ్చుకోవాలనుకుంటున్నారని ప్రశ్నిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు.

హైడ్రాపై సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
X

రాష్ట్రంలో హైడ్రా ఏకపక్షంగా ముందుకెళ్తుందని ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా ప్రశ్నిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు.పేద, మధ్య తరగతి ప్రజలు ఏమైపోవాలి?. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఇచ్చిన పర్మిషన్‌లు తప్పు అని హైడ్రా ఎలా చెబుతుంది. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’’ అని లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆక్రమణలపై, ఆక్రమ నిర్మాణాలపై చట్టబద్దంగా, న్యాయబద్దంగా చర్యలు ఉండాలన్నదే బీజేపీ ఉద్దేశ్యమని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలి..కానీ

మీరు కూల్చివేతలతో పేరుతెచ్చుకోవాలనుకుంటున్నారు.గత పాలకుల, అధికారుల అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజల నుంచి దళారులు దోచుకున్నారు. అన్ని అనుమతులున్న భవనాలను నేలమట్టం చేయడం బాధకరం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చే అనుమతులను తప్పు అని హైడ్రా ఎలా నిర్ణయిస్తుంది. మూసీ పరివాహ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వేలాది మంది జీవనోపాధి ఇక్కడే ఉంటుంది. దుందుడుకు విధానాలతో ముందుకు వెళ్లవద్దు’’ అని లేఖలో రేవంత్‌కు కిషన్‌రెడ్డి సూచించారు.

First Published:  26 Sept 2024 7:00 PM IST
Next Story