మెగాస్టార్‌ను కలిసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇవాళ మెగాస్టార్ చిరంజీవిని మర్యదపూర్వకంగా కలిశారు.
BY Vamshi Kotas2 Nov 2024 6:47 PM IST

X
Vamshi Kotas Updated On: 2 Nov 2024 6:47 PM IST
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని మర్యదపూర్వకంగా కలిశారు. ఇవాళ మెగాస్టార్ ఇంటికి వెళ్లిన కిషన్‌రెడ్డి చిరుకు పుష్ఫం గుచ్ఛం ఇచ్చి దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. అనంతరం శాలువాలు కప్పుకుని ఒకరిని ఒకరు సత్కరించుకున్నారు. ఇక ఈ సమవేశంలో వీరిద్దరు పలు అంశాలపై చర్చించారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను అటు చిరంజీవితో పాటు కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. సినీ పరిశ్రమకు చేసిన కృషి ద్వారా చాలామందికి స్పూర్తిని ఇచ్చారని. అలాంటి వారిని కలవడం ఎప్పుడు ఆనందంగానే ఉంటుందని కిషన్ రెడ్డి రాసుకొచ్చాడు.
Next Story