Telugu Global
Telangana

కాంగ్రెస్‌ ప్రజా విజయోత్సవాలు పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఫైర్

రేవంత్ సర్కార్ ఏడాది పాలనపై ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడంపైనా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కాంగ్రెస్‌ ప్రజా విజయోత్సవాలు పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఫైర్
X

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడంపైనా కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏం సాధించారని ప్రజా విజయోత్సవాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.ఇవాళ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లిలో బండి సంజయ్ పర్యటించారు. ఇటీవల పిడుగుపడి ఇల్లు దగ్ధమైన కుటుంబాన్ని పరామర్శించారు.ఆరు గ్యారంటీలు అమలు చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500 లు ఇచ్చారని విజయోత్సవాలు చేసుకుంటారా? వృద్దులకు రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇచ్చారని చేసుకుంటారా? పేదలకు ఇండ్లు ఇచ్చారని చేసుకుంటారా? దేనికోసం విజయోత్సవాలు అని రేవంత్ ప్రభుత్వాన్ని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పైసలివ్వకుండా తప్పించుకోవడానికి వడ్ల కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తోందని మండిపడ్డారు. బ్రోకర్ల నుంచి కమీషన్లు దండుకునేందుకు రాష్ట్ర రైతుల ప్రయోజనాలను బలి పెడుతున్నారని ధ్వజమెత్తారు. వడ్ల పైసలన్నీ మిత్తీతో సహా కేంద్రమే చెల్లిస్తోందని.. అయినప్పటికీ వడ్లు కొనివ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నొప్పి ఏందని ప్రశ్నించారు.

First Published:  10 Nov 2024 8:07 PM IST
Next Story