34మందికి 'పద్మశ్రీ'లు.. తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు ప్రతిభావంతులు
తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురికి పద్మశ్రీ పురస్కారాలు వరించడం విశేషం. హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి, బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 34మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. కళలు, సామాజిక సేవ, వైద్యం, క్రీడలు, ఇతర విభాగాల కింద వీరిని పురస్కారాలకు ఎంపిక చేసింది. అన్ని రాష్ట్రాలతోపాటు అండమాన్ నికోబార్ వంటి కేంద్ర పాలిత ప్రాంతం నుంచి కూడా ప్రతిభావంతుల్ని ఈ అవార్డులకోసం ఎంపిక చేయడం విశేషం.
#PadmaAwards2024 | Somanna, a Tribal Welfare Worker from Mysuru, tirelessly working for the upliftment of Jenu Kuruba tribe for over 4 decades, to receive Padma Shri in the field of Social Work (Tribal PVTG) pic.twitter.com/zZl6Sge1tE
— ANI (@ANI) January 25, 2024
పురస్కారాల్లో తెలుగు ప్రతిభ..
తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురికి పద్మశ్రీ పురస్కారాలు వరించడం విశేషం. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి, తెలంగాణలో నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.
34మంది జాబితా ఇదే..
కళల విభాగం..
డి. ఉమామహేశ్వరి - ఆంధ్రప్రదేశ్
గడ్డం సమ్మయ్య - తెలంగాణ
దాసరి కొండప్ప - తెలంగాణ
జానకీలాల్ - రాజస్థాన్
గోపీనాథ్ స్వైన్ - ఒడిశా
భాగబత్ పదాన్ - ఒడిశా
స్మృతి రేఖ ఛక్మా - త్రిపుర
ఓంప్రకాశ్ శర్మ - మధ్యప్రదేశ్
నారాయణన్ ఈపీ - కేరళ
బాలకృష్ణన్ సాధనమ్ పుథియ వీతిల్ - కేరళ
సనాతన్ రుద్ర పాల్ - పశ్చిమ బెంగాల్
రతన్ కహార్ - పశ్చిమ బెంగాల్
నేపాల్ చంద్ర సూత్రధార్ - పశ్చిమ బెంగాల్
భద్రప్పన్ - తమిళనాడు
జోర్డాన్ లేప్చా - సిక్కిం
మచిహన్ సాసా - మణిపూర్
శాంతిదేవీ పాసవాన్, శివన్ పాసవాన్ - బీహార్
అశోక్ కుమార్ బిశ్వాస్ - బీహార్
బాబూ రామ్‌యాదవ్ - ఉత్తర్‌ప్రదేశ్
సామాజిక సేవా విభాగం
సోమన్న - కర్నాటక
పార్బతి బారువా - అస్సాం
జగేశ్వర్ యాదవ్ - ఛత్తీస్‌గఢ్
ఛామి ముర్మూ - జార్ఖండ్
గుర్విందర్ సింగ్ - హరియాణా
దుఖు మాఝీ - పశ్చిమ బెంగాల్
సంగ్థాన్‌కిమా - మిజోరం
వైద్య విభాగం
హేమచంద్ మాంఝీ - ఛత్తీస్‌గఢ్
యజ్దీ మాణెక్ షా ఇటాలియా - గుజరాత్
ప్రేమ ధన్‌రాజ్ - కర్నాటక
క్రీడా విభాగం
ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండే - మహారాష్ట్ర
ఇతర విభాగాలు
యనుంగ్ జామోహ్ లెగో - అరుణాచల్ ప్రదేశ్
సర్బేశ్వర్ బాసుమతరి - అస్సాం
సత్యనారాయణ బెలేరి - కేరళ
కె.చెల్లామ్మళ్ - అండమాన్ నికోబార్