బీఎస్పీకి రెండు ఎంపీ స్థానాలు.. RSP పోటీ అక్కడి నుంచే.?
పొత్తులో భాగంగా బీఎస్పీకి గౌరవప్రదమైన స్థానాలు కేటాయిస్తామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఎన్ని స్థానాలు కేటాయిస్తారు, ఏయే స్థానాలు ఇస్తారనే దానిపై ఆసక్తి మొదలైంది.
రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో బీఎస్పీ స్టేట్ చీఫ్ RS ప్రవీణ్ కుమార్ ఇప్పటికే ఓ సారి సమావేశమై చర్చలు జరిపారు. బీఆర్ఎస్‌తో పొత్తుకు బీఎస్పీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పొత్తులో భాగంగా బీఎస్పీకి గౌరవప్రదమైన స్థానాలు కేటాయిస్తామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఎన్ని స్థానాలు కేటాయిస్తారు, ఏయే స్థానాలు ఇస్తారనే దానిపై ఆసక్తి మొదలైంది. తాజాగా ఈ అంశంపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
పొత్తులో భాగంగా బీఎస్పీకి రెండు సీట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. ఎస్సీ రిజర్వ్‌డ్ పార్లమెంట్ స్థానం నాగర్‌కర్నూలుతో పాటు ఎస్టీ రిజర్వ్‌డ్ ఆదిలాబాద్ స్థానాలు బీఎస్పీకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూలు నుంచి బీఎస్పీ స్టేట్ చీఫ్ RS ప్రవీణ్ కుమార్, ఆదిలాబాద్ నుంచి సిడాం గణపతి పోటీ చేస్తారని సమాచారం.