తెలంగాణలో 576 కోట్ల పెట్టుబడులు పెట్టిన రెండు జపాన్ కంపెనీలు
ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టాక తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ మొదలైంది. ఆయన ప్రయత్నాల వల్ల వందల మంది విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులు హైదరాబాద్ లో తమ పరిశ్రమలను, సంస్థలను స్థాపిస్తున్నారు. దీనివల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరగడమే కాక లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి దక్కుతోంది.
ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేవాళ్ళ మొదటి , చివరి మజిలీ హైదరాబాద్ అంటే అతిశయోక్తి కాకపోవచ్చు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, మానవ వనరుల లభ్యత, వాతావరణం ...తదితర కారణాలు పెట్టుబడిదారులను హైదరాబాద్ వైపు చూసేట్టుగా చేస్తున్నాయి.
ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టాక తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ మొదలైంది. ఆయన ప్రయత్నాల వల్ల వందల మంది విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులు హైదరాబాద్ లో తమ పరిశ్రమలను, సంస్థలను స్థాపిస్తున్నారు. దీనివల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరగడమే కాక లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి దక్కుతోంది.
ఈ రోజు జపాన్ కు చె౦దిన రెండు కంపెనీలు హైదరాబాద్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
DAIFUKU అనే జపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ హైదరాబాద్‌లోని చందనవెల్లిలో రూ. 450 కోట్లతో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ 800 మందికి ప్రత్యక్షంగా, వేల మందికి పరోక్షంగా ఉపాధికల్పించనుంది.
ఆటోమేటెడ్ స్టోరెజ్ సిస్టమ్స్, కన్వేయర్లు సహా ఆటోమేటిక్ స్టార్టర్స్ వంటి పరికరాలను తయారు చేసే ఈ సంస్థ ఈ రోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం సంతోషంగా ఉందన్నారు. అనేక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు.
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గరిమెళ్ల మాట్లాడుతూ ఇండియాలో తమ ఉత్పత్తుల తయారు వేగవంతం చేస్తామని చెప్పారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన కొనియాడారు.
ఇక మరో జపాన్ చెందిన నికోమాక్ తాయ్ కిష క్లీన్ రూమ్స్ సంస్థ హైదరాబాద్ లో 126 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థ ఫార్మాస్యూటికల్స్‌తో సహా వివిధ పరిశ్రమలకు అత్యంత అధునాతనమైన క్లీన్ రూమ్ ప్యానెళ్ళు, తలుపులు, కిటికీలు, పైకప్పుల వంటి అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది.
ఈ సంస్థ హైదరాబాద్‌లో 126 కోట్ల రూపాయల పెట్టుబడితో తన మూడవ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దాని క్లీన్‌రూమ్‌ల ఉత్పత్తిని విస్తరించడానికి , HVAC సిస్టమ్‌లను ఉత్పత్తి చేయడం ప్రారంభించనుంది. ఈ రోజు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రకటించారు.
Happy to announce two Japanese investments into Telangana
— KTR (@KTRTRS) December 13, 2022
✅ Daifuku will invest ₹450 Crore in automation of logistics & provide employment to over 800 people
✅ Nicomac Taikisha Cleanrooms is setting up its manufacturing facility investing ₹126 Crore pic.twitter.com/rv4pUWsYCG