Telugu Global
Telangana

కేసీఆర్ సభలో దొరికిన బుల్లెట్లు ఎక్కడివంటే..?

బుల్లెట్లు బయటపడటంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని అస్లంను స్టేషన్ కు తరలించారు. అనుమానాస్పద వ్యక్తి కాకపోవడం, అతడి వివరణ నిజమేనని నిర్థారణ కావడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

కేసీఆర్ సభలో దొరికిన బుల్లెట్లు ఎక్కడివంటే..?
X

సీఎం కేసీఆర్ నర్సాపూర్ సభలో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు దొరికాయి. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు ఓ యూట్యూబ్ ఛానల్ విలేకరి అని తేలడంతో మరింత ఆందోళన మొదలైంది. ఆమధ్య కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి కూడా యూట్యూబ్ ఛానెల్ విలేకరే. అతడి వద్ద రెండు ఐడీ కార్డులు కూడా దొరికాయి. ప్రెస్ అనే పేరుతో ఎంపీకి అతి సన్నిహితంగా వెళ్లి కత్తితో పొడిచాడు. ఇప్పుడు కేసీఆర్ సభలో ప్రెస్ గ్యాలరీవైపు వచ్చిన వ్యక్తి కూడా యూట్యూబ్ ఛానెల్ విలేకరే. అతడి ఐడీకార్డ్ ని పోలీసులు తనిఖీ చేసే క్రమంలో పర్సులోనుంచి రెండు బుల్లెట్లు కిందపడ్డాయి, దీంతో పోలీసులు హడావిడిపడ్డారు.

ఆ బుల్లెట్లు ఎక్కడివి..?

బుల్లెట్లు కలిగిన సదరు యూట్యూబ్ ఛానల్ విలేకరి పేరు అస్లం. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ గ్రామానికి చెందిన అస్లం చిలప్‌ చెడ్‌ మండలం చండూర్‌ లో చికెన్‌ సెంటర్‌ లో పని చేస్తుండేవాడు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ లో విలేకరిగా పనిచేస్తున్నట్టు అతనివద్ద ఐడీ కార్డులు ఉన్నాయి. సీఎం కార్యక్రమ కవరేజీకి నర్సాపూర్‌ కు వచ్చిన అతడు ప్రెస్ గ్యాలరీలోకి వస్తుండగా పోలీసులు ఐడీకార్డు చూపించాలని చెప్పడంతో పర్సు తీసే క్రమంలో రెండు బుల్లెట్లు బయటపడ్డాయి. అయితే ఆ బుల్లెట్లు తనవి కాదని అంటున్నాడు అస్లం.

బుల్లెట్లు బయటపడటంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని అస్లంను స్టేషన్ కు తరలించారు. గతంలో తాను ఎన్.సి.సి. క్యాంపులో పాల్గొన్న సమయంలో ఆ బుల్లెట్లు దొరికాయని, అప్పటినుంచి వాటిని తన పర్సులో పెట్టుకున్నానని చెప్పాడు అస్లం. అనుమానాస్పద వ్యక్తి కాకపోవడం, అతడి వివరణ నిజమేనని నిర్థారణ కావడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

First Published:  17 Nov 2023 7:11 AM IST
Next Story