Telugu Global
Telangana

పన్నెండు రైళ్లు.. నెల రోజులు రద్దు

నిర్వహణ పనుల కారణం అక్టోబర్‌ 1 నుంచి అదే నెల 31 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని దక్షిణమధ్య రైల్వే ప్రకటన

పన్నెండు రైళ్లు.. నెల రోజులు రద్దు
X

నిర్వహణ పనుల కారణంతో వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న 12 రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కాచిగూడ-నిజామాబాద్‌ (07596), నిజామాబాద్‌-కాచిగూడ (07593), మేడ్చల్‌-లింగంపల్లి (47222), లింగంపల్లి-మేడ్చల్‌ (47225), మేడ్చల్‌-సికింద్రాబాద్‌ (47235), సికింద్రాబాద్‌-మేడ్చల్‌ (47236), మేడ్చల్‌-సికింద్రాబాద్‌ (47237), సికింద్రాబాద్‌-మేడ్చల్‌ (47238), మేడ్చల్‌-సికింద్రాబాద్‌ (47242), సికింద్రాబాద్‌-మేడ్చల్‌ (47245), మేడ్చల్‌-సికింద్రాబాద్‌ (47228), సికింద్రాబాద్‌-మేడ్చల్‌ (47229) రైళ్లు అక్టోబర్‌ 1 నుంచి అదే నెల 31 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని తెలిపింది. కాచిగూడ-మెదక్‌ రైలు (07850) ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబర్‌ 1 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది.

First Published:  27 Sept 2024 9:32 AM IST
Next Story