Telugu Global
Telangana

కర్ణాటక కాంగ్రెస్ వర్సెస్ కేటీఆర్.. ట్వీట్ వార్

ప్రియాంక్ ఖర్గే ఆరోపణలపై స్పందించిన కేటీఆర్.. చర్చలో జాయిన్‌ అయినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్‌ చేసిన హామీలను సంబంధించిన పేపర్‌క్లిప్‌లను ట్వీట్‌కు జ‌త చేశారు.

కర్ణాటక కాంగ్రెస్ వర్సెస్ కేటీఆర్.. ట్వీట్ వార్
X

కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలు అమలు చేయలేమంటూ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడిన ఓ వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్.. భవిష్యత్‌లో తెలంగాణలోనూ ఇదే జరుగబోతుందంంటూ మొదట ట్వీట్ చేశారు.

కేటీఆర్ ట్వీట్‌పై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యతో పాటు మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. కేటీఆర్ ఏది నిజమో.. ఏది ఎడిటెడ్‌ వీడియోనో తెలుసుకోకుండా ఉన్నారంటూ ట్వీట్ చేశారు సిద్ధరామయ్య. బీజేపీ వీడియోలను ఎడిట్ చేస్తుందని.. వాటిని బీఆర్ఎస్ సర్క్యూలేట్ చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పర్ఫెక్ట్ బీజేపీ బీ-టీమ్‌ అంటూ సెటైర్లు వేశారు సిద్ధరామయ్య.


సిద్ధరామయ్యకు కౌంటర్‌గా బీఆర్ఎస్ లీడర్ క్రిశాంక్ చేసిన మరో ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్‌ చేశారు. ఐదు గ్యారెంటీల అమలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సదాక్షరి చేసిన కామెంట్స్‌ వీడియోను పోస్టు చేశారు. దీంతో పాటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ బీ-టీమ్‌ అంటూ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు క్రిశాంక్‌. బీజేపీ బిగ్‌ లీడర్స్ బండి సంజయ్, ఈటల రాజేందర్, అర్వింద్, రఘునందన్‌రావులను బీఆర్ఎస్ ఓడించిందని ట్వీట్‌లో చెప్పారు.

ఇక ఈ ట్వీట్‌ వార్‌లో మంత్రి ప్రియాంక్‌ ఖర్గే కూడా కలగజేసుకున్నారు. బీజేపీ అబద్ధాలనే కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని.. బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగలని ఆరోపణలు చేశారు. ప్రియాంక్ ఖర్గే ఆరోపణలపై స్పందించిన కేటీఆర్.. చర్చలో జాయిన్‌ అయినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్‌ చేసిన హామీలను సంబంధించిన పేపర్‌క్లిప్‌లతో పాటు ఈ ఏడాది అభివృద్ధి పనులను కొనసాగించలేమంటూ డిప్యూటీ సీఎం శివకుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్‌ క్లిప్‌లు యాడ్ చేశారు కేటీఆర్‌. ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన హామీ అబద్ధమా.. ఖజానాలో నిధులు లేవంటూ డి.కె. చేసిన కామెంట్స్‌ అబద్ధమో చెప్పాలని ప్రియాంక్‌కు సవాల్ విసిరారు కేటీఆర్.

First Published:  20 Dec 2023 5:19 AM GMT
Next Story