Telugu Global
Telangana

మరో కన్నీటి కథ.. మొన్న రాజయ్య, నేడు తుమ్మల

గత రెండు రోజులుగా తుమ్మల తన అనుచరగణంతో తర్జన భర్జన పడుతున్నారు. బీఆర్ఎస్ లో ఉండాలా, కాంగ్రెస్ లో చేరాలా అంటూ బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరారు.

మరో కన్నీటి కథ.. మొన్న రాజయ్య, నేడు తుమ్మల
X

బీఆర్ఎస్ టికెట్లు దక్కని నేతలు ఈ దఫా బహిరంగంగానే కన్నీటిపర్యంతం అవుతున్నారు. మొన్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అంబేద్కర్ విగ్రహం వద్ద భోరున విలపించారు. తనకు టికెట్ దక్కలేదని అనుచరుల దగ్గర కూడా ఆయన కన్నీటిపర్యంతం అయ్యారు. తాజాగా టికెట్ విషయంలో నిరాశ చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా భావోద్వానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు.

బీఆర్ఎస్ నుంచి పాలేరు టికెట్ ఆశించారు తుమ్మల. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి సీటు కేటాయించారు కేసీఆర్. దీంతో గత రెండు రోజులుగా తుమ్మల తన అనుచరగణంతో తర్జన భర్జన పడుతున్నారు. బీఆర్ఎస్ లో ఉండాలా, కాంగ్రెస్ లో చేరాలా అంటూ బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరారు. ఖమ్మంలో తన అనుచరులతో ఆయన మరోసారి సమావేశమయ్యే అవకాశముంది. ఖమ్మంలో తుమ్మలకు 2వేల కార్లతో భారీగా అనుచరులు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మంలో బలప్రదర్శన చేయాలనుకుంటున్నారు తుమ్మల.

బీఆర్ఎస్ ని వదిలిపెడితే ఎలా ఉంటుందోననే భయం, పార్టీలోనే ఉంటే టికెట్ రాకుండా ఏంచేయాలనే అంతర్మథనం.. ఈ రెండిటి మధ్య నలిగిపోతున్నారు ఆశావహులు. అయితే కొందరు టికెట్ రాకపోయినా పార్టీలోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. తాటికొండ రాజయ్య.. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. మరి తుమ్మల మనసులో ఏముందో తేలాల్సి ఉంది.


First Published:  25 Aug 2023 3:15 PM IST
Next Story