గృహజ్యోతి గైడ్‌లైన్స్ విడుదల.. క్లారిటీ ఇచ్చిన TSSPDCL
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ - TSSPDCL స్పందించింది. అసలు తాము ఎలాంటి గైడ్‌లైన్స్ విడుదల చేయలేదని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గృహజ్యోతి స్కీమ్ కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గృహజ్యోతికి సంబంధించి గైడ్‌లైన్స్ విడుదలయ్యాయంటూ సోషల్ మీడియాలో విద్యుత్ శాఖ పేరిట ఓ మెసేజ్ తెగ వైరల్ అయింది.
అయితే తాజాగా దీనిపై తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ - TSSPDCL స్పందించింది. అసలు తాము ఎలాంటి గైడ్‌లైన్స్ విడుదల చేయలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మెసేజ్ ఫేక్ అని స్ఫష్టం చేసింది. గృహజ్యోతికి అద్దె ఉండే వారు కూడా అర్హులేనని స్పష్టం చేసింది.
Tenants are also eligible under proposed Gruha Jyothi Scheme
— TSSPDCL (@TsspdclCorporat) February 6, 2024
Below post by @TeluguScribe is FAKE https://t.co/Ive0FG09dG
ఎన్నికల ప్రచారంలో భాగంగా పేదలకు 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఆరు గ్యారంటీల్లో మరో రెండు హామీలు అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. రూ.500కే సిలిండర్, 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంటు పథకానికి త్వరలోనే ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.