Telugu Global
Telangana

సంక్రాంతికి TSRTC స్పెషల్ బస్సులు.. మహిళలు టికెట్ తీసుకోవాలా..?

తెలంగాణ ఆర్టీసీ ప్రకటన తర్వాత కూడా అందరిలో ఇవే అనుమానాలున్నాయి. అయితే వీటన్నిటికీ క్లారిటీ ఇచ్చారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.

సంక్రాంతికి TSRTC స్పెషల్ బస్సులు.. మహిళలు టికెట్ తీసుకోవాలా..?
X

పండగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 4,484 స్పెషల్ బస్ సర్వీసుల్ని తెరపైకి తెస్తోంది. సహజంగా స్పెషల్ బస్సులంటే రేట్లు పెంచేస్తారు. అప్పటి వరకు ఇచ్చే రాయితీలను ఆ బస్సుల్లో క్యాన్సిల్ చేస్తారు. తెలంగాణ ఆర్టీసీ ప్రకటన తర్వాత కూడా కొందరిలో ఇవే అనుమానాలున్నాయి. అయితే వీటన్నిటికీ ప్రకటన సమయంలోనే క్లారిటీ ఇచ్చారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.

సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికోసం TSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. వీటిలో 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఈనెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని TSRTC తెలిపింది. అయితే ఈ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేయట్లేదు. సాధారణ చార్జీలే అమలు చేస్తున్నారు. అంతే కాదు. మహాలక్ష్మి స్కీమ్ కూడా ఈ బస్సుల్లో అమలులో ఉంటుంది.

జీరో టికెట్ మాత్రం తప్పనిసరి..

ఏపీకి షెడ్యూల్‌ సర్వీసులతో పాటు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు కూడా నడుపుతామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. పండగ బస్సుల్లో ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండబోదన్నారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్‌ ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అయితే మహిళలు తప్పనిసరిగా జీరో టికెట్లు తీసుకొని ప్రయాణించాలని సూచించారు సజ్జనార్.

First Published:  5 Jan 2024 9:03 PM IST
Next Story