Telugu Global
Telangana

పండగ బస్సులు రెడీ.. టీఎస్ఆర్టీసీ పక్కా ప్లానింగ్

బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.inలో చేసుకోవాలని కోరారు సజ్జనార్. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

పండగ బస్సులు రెడీ.. టీఎస్ఆర్టీసీ పక్కా ప్లానింగ్
X

పండగ సీజన్లో 5,265 ప్రత్యేక బస్సులను రెడీ చేసింది టీఎస్ఆర్టీసీ. బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా ఈ స్పెషల్ బస్సులను రోడ్లపైకి తెస్తోంది. ఈ నెల 13 నుంచి 24 వరకు ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. పండగల సీజన్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. బస్‌ భవన్‌ లో పోలీస్‌, రవాణాశాఖ అధికారులతో ఏర్పాటయిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో ఆర్టీసీ ఉద్యోగులకు పోలీస్‌, రవాణాశాఖలు సహకరిస్తున్నాయని ఆయన తెలిపారు.


స్పెషల్ చార్జీలు లేవు..

ఈ నెల 20 నుంచి 23 వరకు అధిక రద్దీ ఉంటుందని ఆర్టీసీ అంచనా. ఆ రద్దీకి అనుగుణంగా 13వతేదీనుంచి 24 వరకు స్పెషల్ సర్వీసులను ప్రవేశపెడుతోంది. అదనంగా తెచ్చిన బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించినట్టు వివరించారు సజ్జనార్. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు ఏపీ, కర్నాటక, మహారాష్ట్రకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు వెల్లడించారు. గత దసరా కంటే ఈసారి వెయ్యి బస్సులను అదనంగా తిప్పుతున్నామని చెప్పారు. ఈసారి ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయట్లేదని స్పష్టంచేశారు సజ్జనార్.

ప్రయాణికులు సమయాన్ని వృథా చేసుకోకుండా టీఎస్ఆర్టీసీ ఇటీవల తీసుకువచ్చిన గమ్యం ట్రాకింగ్ యాప్ ను వినియోగించుకోవాలని కోరారు సజ్జనార్. పండగలకు రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి.. ఇబ్బందులు పడొద్దని ప్రయాణికులకు సూచించారు. టీఎస్ఆర్టీసీలో ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని చెప్పారు.

బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.inలో చేసుకోవాలని కోరారు సజ్జనార్. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వాలంటీర్లను నియమిస్తున్నామని చెప్పారు.

First Published:  10 Oct 2023 5:34 AM GMT
Next Story