Telugu Global
Telangana

అలాంటి కంపెనీలను ప్రోత్సహించొద్దు -సజ్జనార్

ఐపీఎల్ అఫీషియల్ పార్ట్ నర్స్ అని చెప్పుకుంటూ వారు తమ ప్రోడక్ట్ ల పేరుతో ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారని ఆరోపించారు సజ్జనార్. గొలుసుకట్టు సంస్థలను ప్రోత్సహించొద్దని కోరారు.

అలాంటి కంపెనీలను ప్రోత్సహించొద్దు -సజ్జనార్
X

నాయకులతో, అధికారులతో ఫొటోలు దిగి.. వాటిని చూపిస్తూ సామాన్యులను బురిడీ కొట్టించే కేటుగాళ్లను చాలామందినే చూస్తుంటాం. ఇప్పుడు కొన్ని దగాకోరు కంపెనీలు అలాంటి ప్రచారమే చేసుకుంటున్నాయి. పొరపాటున కూడా అలాంటి కంపెనీలకు ప్రచారం చేసి పెట్టొద్దంటూ సెలబ్రిటీలకు విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. గతంలో కూడా ఆయన కొంతమందికి ఇలాంటి సూచనలు చేశారు. తాజాగా ఐపీఎల్ యాజమాన్యానికి కూడా ఆయన ఇదే తరహా సలహా ఇచ్చారు.


దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు ప్రజల జీవితాలను నాశనం చేసే కొన్ని మోసపూరిత సంస్థలను పార్ట్ నర్స్‌ గా పెట్టుకోవద్దని సూచించారు సజ్జనార్. హెర్బ‌లైఫ్ సంస్థ ఐపీఎల్ పార్ట్ నర్ గా ఉంటూ క్రికెటర్లకు బహుమతులిచ్చే ఫొటోని ట్యాగ్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ అఫీషియల్ పార్ట్ నర్స్ అని చెప్పుకుంటూ వారు తమ ప్రోడక్ట్ ల పేరుతో ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారని ఆరోపించారు సజ్జనార్. గొలుసుకట్టు సంస్థలను ప్రోత్సహించొద్దని కోరారు.


గతంలో కూడా సజ్జనార్.. సానియా మీర్జా, అమితాబ్ బచ్చన్ కి కూడా ఇలాంటి సూచనలే చేశారు. సానియా మీర్జా క్యూనెట్ సంస్థకు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలను ప్రోత్సహించొద్దన్నారు. గతంలో అమితాబ్ బచ్చన్ ఆమ్ వే కంపెనీ తరపున ప్రచారం చేయడాన్ని కూడా సజ్జనార్ ఆక్షేపించారు. అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దని కోరారు. ఆయా కంపెనీలపై ఉన్న ఆరోపణలను, కేసుల్ని ప్రస్తావిస్తూ ఆయన సెలబ్రిటీలకు సలహాలిచ్చారు.



First Published:  25 May 2023 2:42 PM GMT
Next Story