Telugu Global
Telangana

హైద‌రాబాద్ టు విజ‌య‌వాడ.. 10 నిమిషాల‌కో బ‌స్సు.. 10% డిస్కౌంట్‌

ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న వారికి టికెట్‌పై 10 శాతం రాయితీని కూడా క‌ల్పిస్తున్న‌ట్లు టీఎస్ ఆర్టీసీ ప్ర‌క‌టించింది. తిరుగు ప్రయాణానికి టికెట్ బుకింగ్‌ చేసుకుంటే కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని చెప్పింది.

హైద‌రాబాద్ టు విజ‌య‌వాడ.. 10 నిమిషాల‌కో బ‌స్సు.. 10% డిస్కౌంట్‌
X

వేస‌వి సెల‌వుల‌కు, ఎన్నిక‌లకు తెలంగాణ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వెళ్లేవారికి టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ - విజయవాడ రూట్‌లో ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్ప‌టికే 120 బ‌స్సులు

టీఎస్ ఆర్టీసీ హైద‌రాబాద్ నుంచి విజయవాడకు ప్రతిరోజూ 120కి పైగా బస్సులు నడుపుతున్నట్లు స‌జ్జ‌నార్ చెప్పారు. వీటిలో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ బస్సులు 62 ఉన్నట్లు టీఎస్‌ఆర్టీసీ తెలియజేసింది.

ఏసీ బ‌స్సులు మ‌రిన్ని కావాలి

వేస‌వి కాలం కావ‌డంతో ఆర్టీసీ ఏసీ బ‌స్సులు మ‌రిన్ని పెంచాల‌ని ప్ర‌యాణికులు కోరుతున్నారు. ముఖ్యంగా ప‌గ‌టి జ‌ర్నీకి సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసులు త‌గ్గించి, ఏసీ బ‌స్సులు పెంచాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

10% క‌న్సెష‌న్ కూడా..

ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న వారికి టికెట్‌పై 10 శాతం రాయితీని కూడా క‌ల్పిస్తున్న‌ట్లు టీఎస్ ఆర్టీసీ ప్ర‌క‌టించింది. తిరుగు ప్రయాణానికి టికెట్ బుకింగ్‌ చేసుకుంటే కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని చెప్పింది. ప్రయాణికులు టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలని కోరింది.

First Published:  29 April 2024 9:12 AM GMT
Next Story