Telugu Global
Telangana

ఆ బస్సుల్లో వ‌ద్దు.. మహిళలకు TSRTC కీలక సూచన

కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సు ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు సజ్జనార్. దీనివల్ల మిగతావాళ్లకు లేట్ అవుతోందని వివరించారు.

ఆ బస్సుల్లో వ‌ద్దు.. మహిళలకు TSRTC కీలక సూచన
X

మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు TSRTC కీలక సూచన చేసింది. సంస్థ ఎండీ సజ్జనార్ సోషల్‌ మీడియా వేదికగా ఈ ప్రకటన చేశారు. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు సజ్జనార్. దీనివల్ల దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతోందన్నారు. అందుకే ఇకనుంచి తక్కువ దూరం వెళ్లేవాళ్లు ప‌ల్లె వెలుగు బస్సుల్లోనే ఎక్కాలని కోరారు.

అలాగే కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సు ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు సజ్జనార్. దీనివల్ల మిగతావాళ్లకు లేట్ అవుతోందని వివరించారు. అందుకే ఇకపై ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపుతామని చెప్పారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి, సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు.

డిసెంబర్‌ 9న కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది. పథకానికి అనూహ్య స్పందన లభించింది. 11 రోజుల్లోనే ఏకంగా 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బ‌స్సుల్లో ప్రయాణం చేశారు. కానీ, జనం పెరగడంతో పలు ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. కొన్నిరూట్లలో బస్సులు సరిపోవట్లేదనే ఫిర్యాదులు అందాయి. దాంతో కొత్తగా 200 బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు RTC ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అంతా ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనే ఎక్కడంతో దూరప్రాంతాలకు వెళ్లేవాళ్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో అనుమతించిన స్టేజీల్లోనే బస్సులు ఆపుతామని తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

First Published:  23 Dec 2023 5:47 AM GMT
Next Story