Telugu Global
Telangana

దసరాకు ఊరెళ్తున్నారా..? ఇలా చేస్తే బస్ టికెట్ పై 10 శాతం డిస్కౌంట్

ఇటీవలే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రత్యేక కానుకలు ఇచ్చి ఆకట్టుకుంది తెలంగాణ ఆర్టీసీ. ఇప్పుడు బతుకమ్మ, దసరా సందర్భంగా రాయితీతో ప్రయాణ టికెట్లు ఇస్తూ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

దసరాకు ఊరెళ్తున్నారా..? ఇలా చేస్తే బస్ టికెట్ పై 10 శాతం డిస్కౌంట్
X

దసరా పండగకు సొంత ఊరికి వెళ్లే ప్రయాణికులకు ఇది నిజంగా శుభవార్త. పండగ ప్రయాణం సహజంగా కాస్త రేటెక్కువ. కానీ మీరు ముందే ప్లాన్ చేసుకుంటే మీకు 10శాతం రాయితీతో బస్ టికెట్ దొరుకుతుంది. ఈ బంపర్ ఆఫర్ టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మాత్రమే. ఇంతకీ మీరు ఆ 10శాతం రాయితీ పొందాలంటే ఏం చేయాలి..? ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి..?


అక్టోబర్ 15నుంచి 29 మధ్య జరిగే ప్రయాణాలకు టీఎస్ఆర్టీసీ 10శాతం రాయితీతో టికెట్లు అందిస్తుంది. అయితే టికెట్లపై రాయితీ పొందాలంటే ఈనెల 30లోపు రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా రానుపోను ప్రయాణాలు రెండూ ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. అలా చేస్తే తిరుగు ప్రయాణంపై 10శాతం రాయితీ వర్తిస్తుంది. ఈ నెల 30వ తేదీకి ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది టీఎస్ఆర్టీసీ యాజమాన్యం. రిజర్వేషన్ సదుపాయమున్న అన్ని సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది.

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బతుక్మమ్మ, దసరా చాలా పెద్ద పండుగలని ఆయా పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తుంటారని, వారి కోసమే ఈ రాయితీలు ఇస్తున్నట్టు తెలిపారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించిందని చెప్పారు. దసరా పండగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కోసం సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలని సూచించారు సజ్జనార్. ఇటీవలే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రత్యేక కానుకలు ఇచ్చి ఆకట్టుకుంది తెలంగాణ ఆర్టీసీ. ఇప్పుడు బతుకమ్మ, దసరా సందర్భంగా రాయితీతో ప్రయాణ టికెట్లు ఇస్తూ బంపర్ ఆఫర్ ప్రకటించింది.


First Published:  21 Sept 2023 2:18 PM IST
Next Story