గ్రూప్-4 ఫలితాలు వచ్చేశాయి.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎప్పుడంటే
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి టాపర్‌గా నిలిచాడు. ఫలితాల్లో పురుషులదే హవా. టాప్ 10లో ఒక్క మహిళా అభ్యర్థికే స్థానం దక్కింది.
గ్రూప్ -4 ఫలితాలు వచ్చేశాయి. అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను టీఎస్‌పీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ర్యాంకులు చూసుకోవవచ్చని అధికారులు సూచించారు. 300 మార్కులకు 220.458 మార్కులతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి టాపర్‌గా నిలిచాడు. ఫలితాల్లో పురుషులదే హవా. టాప్ 10లో ఒక్క మహిళా అభ్యర్థికే స్థానం దక్కింది.
గ్రూప్-4 ఫలితాల్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి 300 మార్కులకు ఒకే ఒక్క మార్కుతో (1.020) చివరిస్థానంలో నిలిచాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన అభ్యర్థికి 10.318 మార్కులు, వికారాబాద్ జిల్లా అభ్యర్థి 11.425, హైదరాబాద్ జిల్లా అభ్యర్థి 12.445, నాగర్‌కర్నూల్ జిల్లా అభ్యర్థి 14.524 మార్కులతో కింది నుంచి ఐదు స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతానికి జనరల్ ర్యాంకులను ప్రకటించారు. రోస్టర్, స్థానికత ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ కూడా ఇస్తామని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం 8,180 గ్రూప్ -4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 2023 జూలై 1న పరీక్ష నిర్వహించారు. 9.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 7.26 లక్షల మంది పరీక్ష రాశారు.