అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ నెల 5న జరిగిన పరీక్షను రద్దు చేసిన TSPSC
ఇప్పటికే జరగాల్సిన రెండు పరీక్షలను రద్దు చేసిన TSPSC ,ఇప్పుడు కొద్ది రోజుల క్రితం జరిగిన ఎగ్జామ్ ను కూడా రద్దు చేస్తూ కొద్ది సేపటిక్రితం నిర్ణయం తీసుకుంది.
పేపర్ లీకేజ్ వ్యవహారంతో అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి ఈ నెల 5న జరిగిన పరీక్ష రద్దు చేస్తూ TSPSC ప్రకటన జారీ చేసింది. మళ్ళీ పరీక్ష జరిగే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని TSPSC తెలిపింది. 837 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి ఈ నెల 5వ తేదీన పరీక్ష జరిగింది.
TSPSC లో పేపర్ల లీక్ వ్యవహారం సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చైరెన్ దగ్గర కార్యదర్శిగా పని చేస్తున్న ప్రవీణ్, మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ లు కలిపి ఈ పేపర్లను లీక్ చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్న రేణుక అనే యువతి,ఆమె భర్త కలిసి ప్రవీణ్ నుండి పరీక్ష పేపర్లను తీసుకొని మరి కొందరికి అమ్మారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఇప్పటికే జరగాల్సిన రెండు పరీక్షలను రద్దు చేసిన TSPSC ,ఇప్పుడు కొద్ది రోజుల క్రితం జరిగిన ఎగ్జామ్ ను కూడా రద్దు చేస్తూ కొద్ది సేపటిక్రితం నిర్ణయం తీసుకుంది.