Telugu Global
Telangana

గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది

గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల
X

తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల వివరాలను ప్రకటించింది. ప్రాథమిక జాబితాలో వచ్చిన మార్కులపై సందేహాలున్న అభ్యర్థులు 15 రోజుల్లోగా ఒక్కో పేపర్‌కు రూ. 1000 చొప్పున చెల్లించి రీ కౌంటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్‌పై అభ్యంతరాలు స్వీకరించి, ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే 1:2 నిష్పత్తిలో తుది జాబితాను విడుదల చేయనున్నారు.

మొత్తం 563 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్‌ 21వ తేదీ నుంచి అక్టోబర్‌ 27వ తేదీ వరకు 7 పేపర్లకు తెలంగాణ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ప్రిలిమ్స్‌లో 31,383 మంది క్వాలిఫై అయినప్పటికీ.. మెయిన్స్‌ పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం వెబ్‌సై‌ట్‌ tspsc.gov.inను సందర్శించండి.

First Published:  10 March 2025 2:46 PM IST
Next Story