Telugu Global
Telangana

TSPSC పేపర్ హ్యాకింగ్ జరగలేదు... అది హ‌నీ ట్రాప్ అని తేల్చిన పోలీసులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రవీణ్ కు కొంత కాలం క్రితం ఓ యువతి పరిచయమయ్యింది. కొద్ది కాలంలోనే ఇద్దరూ చాలా సనిహితమయ్యారు. ఆ యువతి తరచూ TSPSC కార్యాలయానికి వచ్చిపోతుండేదని పోలీసులు తెలిపారు.

TSPSC పేపర్ హ్యాకింగ్ జరగలేదు... అది హ‌నీ ట్రాప్ అని తేల్చిన పోలీసులు
X

TSPSC ఈ రోజు జరపతలపెట్టిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (TPBO) పరీక్ష, ఈ నెల 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామక పరీక్ష పేపర్లు హ్యాకింగ్ ద్వారా లీక్ అయ్యాయనే అనుమానంతో అధికారులు ఎగ్జామ్స్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే అది హ్యాకింగ్ కాదని హానీ ట్రాప్ అనిపోలీసులు తేల్చినట్టు తెలుస్తోంది. ఈ పేపర్ లీక్ లో . TSPSC సెక్రటరీ పీఏ ప్రవీణ్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రవీణ్ కు కొంత కాలం క్రితం ఓ యువతి పరిచయమయ్యింది. కొద్ది కాలంలోనే ఇద్దరూ చాలా సనిహితమయ్యారు. ఆ యువతి తరచూ TSPSC కార్యాలయానికి వచ్చిపోతుండేదని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో ఈ రోజే జరగాల్సిన టౌన్ ప్లానింగ్ పరీక్షా పేపర్ ఇవ్వాలని ఆ యువతి ప్రవీణ్‌ను కోరింది. దాంతో ప్రవీణ్ ఆ యువతి కోరిక మేరకు కంప్యూటర్ నుండి ఆ పేపర్ ను కాపీ చేసి యువతికి అందించాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ ను ప్రవీణ్ ఓపెన్ చేసి పేపర్ ఎలా కాఫీ చేశాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పేపర్ ఎవరెవరికి ఇచ్చాడు. ఎంత మంది చేతులు మారింది అనే దానిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. విచారణ తర్వాత మరిన్ని విషయాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది.

First Published:  12 March 2023 1:45 PM IST
Next Story