టెట్ హాల్ టికెట్ల విడుదల.. ఈనెల 15న పరీక్ష
www.tstet.cgg.gov.in అనే వైబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు విద్యాశాఖ అధికారులు. హాల్ టికెట్లు తీసుకోవడంలో సమస్యలు ఎదురైతే హెల్ప్ డెస్క్ ని సంప్రదించాలని సూచించారు.
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈరోజు నుంచి పరీక్షకు ఒకరోజు ముందు (14వతేదీ) వరకు వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలంటే మన వద్ద దరఖాస్తు ఐడీ నెంబర్, పుట్టినతేదీ వివరాలు ఉండాలి. ఆ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు అధికారులు.
www.tstet.cgg.gov.in అనే వైబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు విద్యాశాఖ అధికారులు. హాల్ టికెట్లు తీసుకోవడంలో సమస్యలు ఎదురైతే హెల్ప్ డెస్క్ ని సంప్రదించాలని సూచించారు.
టెట్ హెల్ప్ డెస్క్ నెంబర్లు..
040-23120340
040-23120433
15వతేదీ పరీక్ష..
సెప్టెంబరు 15వ తేదీన టెట్ నిర్వహిస్తారు. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. టెట్ ఫలితాలను ఈనెల 27న విడుదల చేస్తారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లో అర్హత సాధించినవారు, ఆ తర్వాత టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్(టీఆర్టీ) రాయాల్సి ఉంటుంది.