తెలంగాణ ఇంటర్ ఫలితాలు..పాస్ పర్సంటేజ్ ఎంతంటే.?
ఇక జిల్లాల వారీగా ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేసులో ఉండగా..మేడ్చల్ జిల్లా సెకండ్ ప్లేసులో నిలిచింది. ఇక సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించి ములుగు జిల్లా ఫస్ట్ ప్లేసు, మేడ్చల్ జిల్లా సెకండ్ ప్లేసులో నిలిచాయి.
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా ఫలితాలు విడుదల చేశారు. ఈ సారి కూడా బాలికలే పై చేయి సాధించారు.
ఇంటర్ ఫస్టియర్‌లో మొత్తం 60.01 శాతం మంది ఉత్తీర్ణులు కాగా..సెకండియర్‌లో 64.19 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫస్టియర్‌లో బాలికల ఉత్తీర్ణత శాతం 68.35 శాతంగా ఉంటే..
బాలురు 51.5 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండియర్‌లో 72.53 శాతం మంది బాలికలు పాస్ కాగా..56.1 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు.
ఇక జిల్లాల వారీగా ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేసులో ఉండగా..మేడ్చల్ జిల్లా సెకండ్ ప్లేసులో నిలిచింది. ఇక సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించి ములుగు జిల్లా ఫస్ట్ ప్లేసు, మేడ్చల్ జిల్లా సెకండ్ ప్లేసులో నిలిచాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి 9 లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.