Telugu Global
Telangana

తెలంగాణ ఇరిగేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా డా. వేణుగోపాలాచారి

ప్రధానులు దేవెగౌడ, ఐకే గుజ్రాల్ మంత్రి వర్గంలో ఆయన సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ, వ్యవసాయ శాఖల మంత్రిగా వేణుగోపాలాచారి పని చేశారు.

తెలంగాణ ఇరిగేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా డా. వేణుగోపాలాచారి
X

తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలా చారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేణుగోపాలాచారి ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. నిర్మాల్ జిల్లాకు చెందిన వేణుగోపాలాచారి 1985 నుంచి 1996 వరకు వరుసగా ఎమ్మెల్యేగా కొనసాగారు. 1995లో చంద్రబాబు మంత్రివర్గంలో పని చేశారు. మంత్రిగా ఉంటూనే 1996లో అదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

ప్రధానులు దేవెగౌడ, ఐకే గుజ్రాల్ మంత్రి వర్గంలో ఆయన సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ, వ్యవసాయ శాఖల మంత్రిగా పని చేశారు. 1998లో మరోసారి ఎంపీగా గెలిచి.. ఏబీ వాజపేయి ప్రభుత్వంలో కూడా కేంద్ర మంత్రిగా పని చేశారు. 1999లో ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించి 2004 వరకు అదే పదవిలో కొనసాగారు. అయితే 2004లో అదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

2009లో కొత్తగా ఏర్పాటైన ముధోల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2012లో టీడీపీకి రాజీనామా చేసి.. ఉపఎన్నికలో మరోసారి గెలిచారు. 2013లో బీఆర్ఎస్‌లో జాయిన్ అయిన తర్వాత 2014 టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేసీఆర్ నియమించారు. ఎంతో అనుభవం ఉన్న వేణుగోపాలాచారికి కీలకమైన ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.




First Published:  29 Dec 2022 7:17 PM IST
Next Story