రెండు ఆడియో క్లిప్స్‌లోని పూర్తి చర్చ ఇదే.. ఎవరెవరు ఏం మాట్లాడారు!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారానికి సంబంధించి బయటకు వచ్చిన రెండు ఆడియో క్లిప్స్‌లో ఎవరెవరు ఏం మాట్లాడారో ఇక్కడ చదవండి.
ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు ఫోన్‌లో చేసిన సంభాషణ మొత్తం ఆడియో రికార్డు అయ్యింది. శుక్రవారం దీనికి సంబంధించిన రెండు ఆడియో క్లిప్స్ బయటకు వచ్చాయి. దానిలో ఎవరు ఏమేం మాట్లాడారో ఒకసారి పరివీలించండి.
AUDIO 1 :
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బిజెపి ఏజెంట్లుగా వచ్చి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో బేరమాడుతున్న...రామచంద్ర భారతి, నందకుమార్
రామచంద్రభారతి: హలో.. హలో..
నందకుమార్: స్వామీజీ మాట్లాడండి
రోహిత్‌రెడ్డి: నమస్కారం స్వామీజీ.. ఎలా ఉన్నారు?
రామచంద్రభారతి: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
రోహిత్‌రెడ్డి: జీ, నంద జీకి మాకు మధ్య చర్చలు జరుగుతున్నాయి
రామచంద్రభారతి: మాకు ఇంకొంచెం వివరాలు కావాలి, అక్కడ మాట్లాడుతాను
రోహిత్‌రెడ్డి: నేను ఇప్పటికే వారితో మాట్లాడాను, వారు ఒప్పుకున్నారు
రామచంద్రభారతి: నాకు ఒక సారి పేర్లు ఖరారు చేస్తే సులభమైపోతుంది
రోహిత్‌రెడ్డి: స్వామిజీ ఇప్పుడే పేర్లు చెప్పడం కష్టం, ఇప్పటికైతే నాకు ఇద్దరు కన్‌ఫర్మ్ చేశారు
రోహిత్‌రెడ్డి: కానీ ఒకసారి కలిసి మాట్లాడుకుంటే మంచిది
రామచంద్రభారతి: కచ్చితంగా కలుద్దాం, 24 తారీకు వరకు నేను బెడ్‌రెస్ట్‌లో ఉన్నాను, 24 వరకు రాలేను
రామచంద్రభారతి: 24 తారీకు తర్వాత నన్ను ఒకసారి రమ్మంటావా, హైదరాబాదైనా లేదా మరెక్కడైనా కలుద్దాం
రామచంద్రభారతి: హైదరాబాద్ వద్దు ఇంకెక్కడైనా కలుద్దామా
రోహిత్‌రెడ్డి: అలా కాదు స్వామిజీ.. సమస్యేంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మీకు తెలుసుకదా
రోహిత్‌రెడ్డి: మా మీద కూడా దృష్టి ఉంటుంది, వేరే ప్లేస్ వద్దు, హైదరాబాద్‌లో అయితేనే బాగుంటుంది
రోహిత్‌రెడ్డి: ఎందుకంటే మేమంతా హైదరాబాద్‌లోనే ఉంటాం కాబట్టి, హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ మనకు
రోహిత్‌రెడ్డి: మీరు కలవాలనుకున్న రోజు బి.ఎల్.సంతోష్ జీ కూడా చార్టర్‌లో వస్తానని నందూ చెప్పాడు
రోహిత్‌రెడ్డి: ఒక అరగంట సేపు మనం చర్చించుకోవచ్చు, ముగించుకోవచ్చు
రామచంద్రభారతి: రేపు ఉదయం నేను బి.ఎల్.సంతోష్‌తో మాట్లాడుతా
రామచంద్రారెడ్డి: బల్క్ రెడీగా ఉంటే బి.ఎల్.సంతోష్ కూడా వస్తారు
రోహిత్‌రెడ్డి: చూడండి స్వామిజీ, నాతో కలిపి ముగ్గురు రెడీగా ఉన్నారు
రామచంద్రభారతి: మనం ఏం చేద్దామంటే, 24 తర్వాత ఒకసారి నేను హైదరాబాద్ వస్తాను
రామచంద్రభారతి: మనం కూర్చొని మాట్లాడుకుందాం, అదే రోజు మనం నిర్ణయం తీసుకొని ముందుకెళ్దాం
రోహిత్‌రెడ్డి: ఓకే స్వామిజీ, మనం అలాగే చేద్దాం కానీ..
రామచంద్రభారతి: మీరు నందూజీతో ఏదైతే మాట్లాడారో అందులో ఎలాంటి సమస్యా లేదు
రామచంద్రభారతి: మిగిలిన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు
రోహిత్‌రెడ్డి: నందుజీ నాకు ఈ ప్రపోజల్ ఇచ్చారు, నేను ఓకే అనుకున్నా
రోహిత్‌రెడ్డి: నాకు అన్ని విధాలా హామీ ఇచ్చారు, నా రక్షణ, నా భవిష్యత్‌పై నందూ నాకు హామీ ఇచ్చారు
రామచంద్రభారతి: కచ్చితంగా ఇదే విషయం మరోసారి మీ ముందే మాట్లాడుకుందాం
రామచంద్రభారతి: ఇందులో సందేహం లేదు, ముందు వచ్చినవారే ముందు వరుసలో ఉంటారు
రామచంద్రభారతి: మీరు వ్యవస్థను బాగా చదివారు, అసలు విషయం ఏంటో కచ్చితంగా తెలుసు
రామచంద్రభారతి: అందుకే మిమ్మల్ని ప్రమోట్ చేయడం మాకు చాల సులభం
రోహిత్‌రెడ్డి: నేను కూడా ఆసక్తిగానే ఉన్నా, ఇప్పటికే నా గురించి మీ అందరికీ తెలుసు
రామచంద్రభారతి: తప్పకుండా మీకు మేం సపోర్ట్ గా ఉంటాం
రామచంద్రభారతి: అవన్ని మనం ఫోన్‌లో మాట్లాడుకోవడం మంచిది కాదు
రామచంద్రభారతి: ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, మిగిలిందంతా మేం చూసుకుంటాం
రామచంద్రభారతి: మీరు ఎలాంటి ప్రపోజల్ ఇచ్చినా దాని ప్రకారమే ముందుకెళ్తాం
రోహిత్‌రెడ్డి: నాకేమీ తొందర లేదు, నందూయే రేపు, రేపు అంటూ తొందర పెడుతున్నారు
రామచంద్రభారతి: మునుగోడు ఎన్నికల తేదీ 3కు ముందే చేరితే మరోలా ఉంటుంది
రామచంద్రభారతి: మా ఆర్గనైజేషన్‌లో స్ట్రాంగ్ లీడర్ కావాలని అనుకున్నాం
రామచంద్రభారతి: అందుకే నేను నందుపై ఒత్తిడి తెస్తున్నాం
రామచంద్రభారతి: 4, 5 రోజులుగా నందు నిద్రకూడా పోవడం లేదు
రామచంద్రభారతి: మరో ఇద్దరు, ముగ్గురి పేర్లు కూడా నందూ తీసుకొచ్చాడు, కానీ వద్దనుకున్నాం
నందూ: స్వామిజీ మీరు మరోసారి క్లారిటీ తీసుకోగలరు
నందూ: మేం కూడా ఎక్కువ మందిని తీసుకురావడానికి ప్రయత్నిస్తాం
నందూ: ఎలాగూ దీపావళి కూడా ఉంది, అప్పటివరకు మేం మరింత మందిని తీసుకురావడానికి ప్రయత్నిస్తా
రోహిత్‌రెడ్డి: స్వామీజీ మరో విన్నపం ఏంటంటే, ఎక్కువ మందిని ప్రయత్నం చేయొద్దు
రోహిత్‌రెడ్డి: మా సీఎం గురించి మీకు తెలుసు కదా, చాలా దూకుడు స్వభావం గల వ్యక్తి
రోహిత్‌రెడ్డి: మా సీఎంకు తెలిస్తే మా పని పడతారు, మేం ముగ్గురం అయితే సిద్ధంగా ఉన్నాం
రామచంద్రభారతి: ఆ ముగ్గురి పేర్లు నేను తెలుసుకుంటే ముందుకెళ్లడానికి మరింత సులభం
రామచంద్రభారతి: అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంది, మనం ఈనెల 26న కూర్చొని మాట్లాడుకుందాం
రామచంద్రభారతి: నెం.2 ఎదుట ఎవరెవరు ఓకే అన్నారో పేర్లు చెబుతారా
రోహిత్‌రెడ్డి: నెం.2 ఎదుట పేర్లు చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు
రోహిత్‌రెడ్డి: ప్లీజ్ ప్లీజ్ ఈ విషయం బయటకు పొక్కొద్దు
రామచంద్రభారతి: మీకు ఈడీ నుంచి ఐటీ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు
రామచంద్రభారతి: మీ భద్రత, మీ భవిష్యత్ అంతా కేంద్రం చూసుకుంటుంది
రామచంద్రభారతి: మా సంస్థలో బి.ఎల్.సంతోష్ చాలా కీలకం
రామచంద్రభారతి: నెం.1, 2లే బి.ఎల్.సంతోష్ ఇంటికి వస్తుంటారు
రామచంద్రభారతి: నెం.1, నెం.2ల ఇంటికి బి.ఎల్. సంతోష్ వెళ్లరు, అది RSS ప్రొటోకాల్
AUDIO 2 :
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బిజెపి ఏజెంట్లు... రామచంద్ర భారతి, నందకుమార్ , సింహయాజిల సంభాషణ
• నందు: మరో నలుగురితో బీజేపీలో చేరేందుకు పైలట్ సిద్ధంగా ఉన్నాడు
• నందు : పైలట్‌కి ఒక రేటు, మిగతా వారికి మరొక రేటు
• నందు : పోలింగ్‌కు ముందు చేరితే రూ. 100 కోట్లు
• రామచంద్ర భారతి : బండి సంజయ్ మరియు కిషన్ రెడ్డిలకు అంత ప్రాముఖ్యత లేదు
• రామచంద్ర భారతి : నేరుగా కేంద్రంతోనే ఒప్పందాలు
• రామచంద్ర భారతి: గుజరాత్ ఎన్నికలకు ముందు మనం ఇంత రిస్క్ చేస్తున్నాం
• నందు: ముగ్గురు రోహిత్‌తో రావడానికి సిద్ధంగా ఉన్నారు
• రామచంద్ర భారతి : మీరు రోహిత్ సహచరుల పేర్లు చెబితే, నేను జిఎల్ సంతోష్‌తో మాట్లాడతాను
• రామచంద్ర భారతి : హైదరాబాద్ రావాలని అడిగితే ఎంత మంది పార్టీలో చేరుతారని బీఎల్ సంతోష్ ప్రశ్నించారు.
• నందు: చేవెళ్ల, పరిగి, తాండూరు వెళతాం.
• రామచంద్ర భారతి: ఎమ్మెల్యేల కొనుగోళ్లను బీఎల్ సంతోష్ జీ, అమిత్ షా చూసుకుంటున్నారు.
రామచంద్రభారతి: పెద్దఎత్తున ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది
• రామచంద్ర భారతి: ఒకరికొకరు సమయం వృధా చేసుకోకండి
రామచంద్ర భారతి: మనం ముందుగా మన ఆపరేషన్ చేస్తే చాలా ప్రభావంగా ఉంటుంది, ముందుగా నలుగురు వస్తారని, తర్వాత 10 మంది వస్తారని నందు హామీ ఇచ్చారు.
• రామచంద్ర భారతి: ఎమ్మెల్యేలు ఇతరుల పేర్లతో సిమ్‌ల ద్వారా మాట్లాడాలి, అదే నేను చేస్తున్నాను
• చెల్లింపు విషయంలో ఎలాంటి సమస్య లేదని రామచంద్ర భారతి నందుకి హామీ ఇచ్చారు
• తుషార్ ను తీసుకువస్తారా అన్నది రామచంద్ర భారతి ప్రశ్న
• రామచంద్ర భారతి: తుషార్‌ను కలవడానికి ఎమ్మెల్యేలకు ఇబ్బంది లేదా?
• నందు: తుషార్‌తో మాట్లాడటానికి ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బంది లేదు
• రామచంద్ర భారతి : నం.1, నం. 2కి సంబంధించిన వ్యక్తి తుషార్‌ను తీసుకున్నాడు
• రామచంద్ర భారతి: బీఎల్ సంతోష్ సాధారణ వ్యక్తి కాదు
• రామచంద్ర భారతి: BL సంతోష్‌ను కేంద్ర మంత్రులు నియమిస్తారు
• రామచంద్ర భారతి: రోహిత్ రాజీనామా చేసిన నెలరోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది
రామచంద్రభారతి: నలుగురు ఎమ్మెల్యేలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం రద్దు
• రామచంద్ర భారతి: సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తే ఎంతయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం కాసేపు కూర్చున్నాక మంత్రులు,మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలను ముట్టుకుందాం.
• రామచంద్ర భారతి: ఆపరేషన్ ఢిల్లీ కూడా నడుస్తోంది
• రామచంద్ర భారతి: 43 మంది ఆప్ ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటికీ ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోరు
• రామచంద్ర భారతి: త్వరలో నందుని పార్టీలోకి తీసుకుని నామినేటెడ్ పదవి ఇద్దాం
• రామచంద్ర భారతి: మాకు సహకరించిన వారికి కేంద్ర భద్రత కల్పిస్తాం.