రౌండ్ రౌండ్ కూ పెరుగుతున్న టీఆరెస్ ఆధిక్యం... 10వ రౌండ్ పూర్తి
మునుగోడు ఓట్ల లెక్కింపులో టీఆరెస్ గెలుపువైపు దూసుకపోతోంది. రౌండ్ రౌండ్ కు తన మెజార్టీ పెంచుకుంటూ ప్రతి రౌండ్ లోనూ బీజేపీ మీద పై చేయి సాధిస్తూ ఉంది.
BY Telugu Global6 Nov 2022 3:03 PM IST

X
Telugu Global Updated On: 6 Nov 2022 3:03 PM IST
మునుగోడు ఓట్ల కౌంటింగ్ ఉత్కంటను రేకిత్తిస్తోంది. రౌండ్ రౌండ్ కు టీఆరెస్ తన ఆధిక్యతను మెల్లెగా పెంచుకుంటూ పోతూ ఉంది. పదవ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆరెస్ 4416 మెజార్టీ కి చేరుకుంది.
మొదటి రౌండ్ లో టీఆరెస్ కు 1292 ఓట్ల మెజార్టీ రాగా రెండవ రౌండ్ కు వచ్చేసరికి కాస్త తగ్గి 451 ఓట్లు, మూడవ రౌండ్ లో మరింత తగ్గి 415, నాలుగవ రౌండ్ లో మళ్ళీ పెరిగి 714, ఐదవ రౌండ్ లో 1531 , ఆరవ రౌండ్ లో 2169, ఏడవ రౌండ్ లో 2568, ఎనిమిదవ రౌండ్లో 3100,తొమ్మిదవ రౌండ్ లో 3925 , పదవ రౌండ్ ముగిసే సరికి 4416 మెజార్టీకి చేరుకుంది టీఆరెస్.
క్రమ క్రమంగా టీఆరెస్ మెజార్టీ పెరుగుతుండటం, ఇంకా లెక్కించాల్సిన ఒట్లు 5 రౌండ్లే ఉండటంతో తమ గెలుపు ఖాయమైనట్టే అని టీఆరెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.
Next Story