Telugu Global
Telangana

టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్.. తీర్మానానికి ఆమోదం

ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్పు చెందింది.

టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్.. తీర్మానానికి ఆమోదం
X

ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్పు చెందింది. ఇవాళ తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పేరు మార్పుపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. సరిగ్గా మధ్యాహ్నం 1.19కి భారత్ రాష్ట్ర సమితి పేరును పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. అంతకు ముందే పార్టీ పేరును ఎందుకు మారుస్తున్నామో, జాతీయ పార్టీ ఆవశ్యకత ఏమిటో సభ్యులకు వివరించారు.

తెలంగాణ రాజకీయ చరిత్రలో ఇది సరికొత్త శకమని కేసీఆర్ అభివర్ణించారు. దేశంలో బీజేపీ సాగిస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో, మోడీ ప్రభుత్వంపై పోరాడాలనే ఉద్దేశంతో పార్టీని జాతీయ స్థాయికి తీసుకొని వెళ్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఉద్యమ స్పూర్తితో పని చేసిందో.. బీఆర్ఎస్ కూడా దేశంలో సుపరిపాలన కోసం పని చేస్తుందని చెప్పుకొచ్చారు. పేరు మార్పు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ దేశంలో ప్రభంజనం సృష్టించబోతోందని చెప్పారు.

First Published:  5 Oct 2022 1:48 PM IST
Next Story