5న టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ పై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్
మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైనప్పటికీ అక్టోబర్ 5వ తేదీన జరగాల్సిన టీఆరెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈసీ నోటిఫికేషన్ నేపథ్యంలో సభ నిర్వహణపై ఎలాంటి భయాందోళనకు గురికావద్దని టీఆర్‌ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలకు ప్రత్యేకంగా తెలియజేశారు.
BY Telugu Global3 Oct 2022 3:53 PM IST

X
Telugu Global Updated On: 3 Oct 2022 3:53 PM IST
అక్టోబర్ 5వ తేదీ ఉదయం 11 గంటలకు టీఆరెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఆ సమావేశం ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వచ్చాయి.
అయితే టీఆరెస్ జనరల్ బాడీ సమావేశం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం తెలిపారు.
ఎన్నికల సంఘం ప్రకటించిన మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌కు టీఆర్‌ఎస్ పార్టీ సమావేశానికి ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. ఈసీ నోటిఫికేషన్ నేపథ్యంలో సభ నిర్వహణపై ఎలాంటి భయాందోళనకు గురికావద్దని టీఆర్‌ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతరులకు ప్రత్యేకంగా తెలియజేశారు.
Next Story