Telugu Global
Telangana

కొండంత రాగం తీసి.. పాటని ఖూనీ చేశారు

పాట విడుదలయ్యాక ఆ విమర్శలు మరింత పెరిగాయి. ఏం స్వరకల్పన..? ఏం సంగీతం..? అంటూ సెటైర్లు వేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

కొండంత రాగం తీసి.. పాటని ఖూనీ చేశారు
X

జయజయహే తెలంగాణ పాట కొత్త వెర్షన్ ఈరోజు విడుదలైంది. కీరవాణి సంగీతాన్నిచ్చిన ఈ కొత్త వెర్షన్ ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. అయితే ఈ పాట విడుదలకు ముందు నుంచీ విమర్శలున్నాయి. పాట విడుదలయ్యాక ఆ విమర్శలు మరింత పెరిగాయి. ఏం స్వరకల్పన..? ఏం సంగీతం..? అంటూ సెటైర్లు వేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.


కోట్లాదిమంది గుండెల్లో భావోద్వేగాలు రేకెత్తించిన, ఉద్యమ గీతాన్ని అన్యాయంగా ఖూనీ చేశారని విమర్శించారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ కుమార్. ఉద్యమస్ఫూర్తిదాయకమైన పాటను అందెశ్రీ రాస్తే.. కొండంత రాగం తీసి ఆగమాగం చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన మూర్ఖత్వంతో పాటను చెడగొట్టారన్నారు. కీరవాణి, రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ దాసోజు శ్రావణ్ వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.


మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఈ పాటపై విమర్శలు ఎక్కుపెట్టారు. పాత పాట, కొత్తపాటను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. కీరవాణి సంగీతాన్నిస్తున్నారనే ప్రస్తావన రాగానే జయజయహే గీతం వివాదాస్పదంగా మారింది. తెలంగాణలో ప్రతిభావంతులైన చాలామంది సంగీత దర్శకులుండగా, కీరవాణికి ఈ అవకాశం ఎందుకిచ్చారని ప్రశ్నించారు ఉద్యమకారులు, కళాకారులు. ఆ విమర్శలను లెక్కచేయకుండా ప్రభుత్వం ముందుకెళ్లింది. తీరా ఇప్పుడు కొత్త పాట విడుదలయ్యాక విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. పాత పాటే బాగుందని, అనవసరంగా కొత్త రాగంతో దాన్ని ఖూనీ చేశారని ఇప్పుడు మరింత ఘాటుగా విమర్శలు మొదలయ్యాయి.

First Published:  2 Jun 2024 11:52 AM GMT
Next Story