బీకామ్ లో ఫిజిక్స్.. మరో జాతిరత్నం బండి సంజయ్
ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో టీచర్ ఏంటయ్యా బాబూ అని అడిగితే.. అదేనండి ప్రభుత్వ ఉద్యోగం అంటూ కవర్ చేసుకున్నారు. మహానుభావుడు మన సంజయ్ అంటూ కామెంట్లు పడుతున్నాయి.
బీకామ్ లో ఫిజిక్స్ చేశానంటూ అప్పటి ఏపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత కూడా చాలామంది అలాగే తమ తమ తెలివితేటలు ప్రదర్శించి బుక్కయ్యారు. అందులో బండి సంజయ్ కూడా ఉన్న విషయం చాలా కొద్దిమందికే తెలుసు. అయితే ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇవీ బండి సంజయ్ తెలివితేటలు అంటూ సెటైర్లు పేలుతున్నాయి.
ఇంతకీ బండి ఏమన్నారు..?
మీ నాన్నగారు ఏం చేసేవారు అంటూ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ తెలివితేటలు బయటపడ్డాయి. "మా నాన్నగారు రిటైర్డ్ టీచర్, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్" లో అంటూ బండి సంజయ్ చెప్పిన మాటలకు ఇంటర్వ్యూ చేసే నాగరాజుకి ఫీజులు ఎగిరిపోయాయి. అయితే అప్పటికే ఆయన బీకామ్ ఫిజిక్స్ లాంటి జాతిరత్నాలను చూసి ఉన్నారు కాబట్టి షాక్ తిని కిందపడలేదు. కానీ నెటిజన్లు మాత్రం బండి సంజయ్ ని చెడుగుడు ఆడేసుకుంటున్నారు. పాత ఇంటర్వ్యూని ఇప్పుడు తెగ వైరల్ చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో టీచర్ ఏంటయ్యా బాబూ అని అడిగితే.. అదేనండి ప్రభుత్వ ఉద్యోగం అంటూ కవర్ చేసుకున్నారు. మహానుభావుడు మన సంజయ్ అంటూ కామెంట్లు పడుతున్నాయి.
ఇంతకీ బండి సంజయ్ చెప్పినదాంట్లో ఏది నిజం అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. సంజయ్ తండ్రి ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఉద్యోగా, లేక నిజంగానే టీచరా అనేది వారికే తెలియాలి. ఇలాంటి జాతిరత్నాలంతా TSPSC గురించి, పోటీ పరీక్షల గురించి మాట్లాడటం మన ఖర్మ కదా అని మండిపడుతున్నారు. మొత్తానికి బండి సంజయ్ తన తెలివితేటల్ని అలా బయటపెట్టుకున్నారు. అప్పుడు నోరుజారారు, ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్నారు.