సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గిరిజన యూనివర్శిటీ వీసీ
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సమ్మక్క సారక్క వీసీ యడవల్లి లక్ష్మీ శ్రీనివాస్ కలిశారు.
BY Vamshi Kotas16 March 2025 3:48 PM IST

X
Vamshi Kotas Updated On: 16 March 2025 3:48 PM IST
ములుగు సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. యడవల్లి లక్ష్మీ శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రిని ఉపకులపతి శాలువాతో సన్మానించి సత్కరించారు. నూతన వీసిగా నియామకమైన శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమక్రమంగా నెరవేర్చాలని సూచించారు.
2024 మార్చిలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాత్కాలిక భవనాలలో యూనివర్సిటీని ప్రారంభించారు. రూ.889 కోట్లతో యూనివర్సిటీ నిర్మాణం తలపెట్టి.. కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రారంభించారు. త్వరలోనే పూర్తిస్థాయి భవనాలను అందుబాటులోకి తెచ్చి, తాత్కాలిక భవనాల నుంచి శాశ్వత భవనాలలో తరగతులు నిర్వహించేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. వీసీగా నియమించినందుకు ప్రధాని మోదీకి కేంద్రమంత్రి బండి సంజయ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Next Story