Telugu Global
Telangana

మహేశ్వరంలో టఫ్‌ ఫైట్‌ తప్పదా.. కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్‌!

మహేశ్వరం నుంచి తీగల కృష్ణారెడ్డి పార్టీలో చేరకపోతే..బలమైన అభ్యర్థిని సబిత ఇంద్రారెడ్డికి పోటీగా నిలపాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంది. మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని అక్కడి నుంచి పోటీ చేయించేందుకు సన్నాహాలు చేస్తోంది.

మహేశ్వరంలో టఫ్‌ ఫైట్‌ తప్పదా.. కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్‌!
X

మహేశ్వరంలో టఫ్‌ ఫైట్‌ తప్పదా.. కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ సారి నియోజకవర్గంలో ట్రయాంగిల్ ఫైట్ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.

2018లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై 9 వేల 227 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకుని మంత్రి పదవి సైతం పొందారు. మొత్తం ఓట్లలో సబితా ఇంద్రారెడ్డికి 40.76 శాతం, కృష్ణారెడ్డికి 36.82 శాతం ఓట్లు వచ్చాయి. సబితా ఇంద్రారెడ్డికి 95,481 ఓట్లు రాగా, కృష్ణా రెడ్డికి 86,254 ఓట్లు వచ్చాయి.

అయితే మహేశ్వరం నియోజకవర్గం అభ్యర్థిని ఫస్ట్ లిస్ట్‌లో ప్రకటించలేదు కాంగ్రెస్‌. ఇందుకు రెండు కారణాలున్నాయని సమాచారం. బీఆర్ఎస్‌కు చెందిన తీగల కృష్ణారెడ్డి పార్టీలోకి వస్తే ఆయనకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంది. ఇక మహేశ్వరం టికెట్‌ కోసం పెద్ద ఎత్తున ఆశావహులు ఉండడం కూడా పార్టీకి కొంత ఇబ్బందిగా మారింది. అయితే ఆసక్తికరంగా కాంగ్రెస్‌ మహేశ్వరం నియోజకవర్గం నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించింది. తుక్కుగూడలో విజయభేరి సభ నిర్వహించింది. ఈ సభా వేదిక నుంచే సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలు ప్రకటించారు.

మహేశ్వరం నుంచి తీగల కృష్ణారెడ్డి పార్టీలో చేరకపోతే..బలమైన అభ్యర్థిని సబిత ఇంద్రారెడ్డికి పోటీగా నిలపాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంది. మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని అక్కడి నుంచి పోటీ చేయించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక గత ఎన్నికల్లో బీజేపీ తరపున అందెల శ్రీరాములు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని అందెల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి MIM మద్దతు కూడా ఉంది. జల్‌పల్లి మున్సిపాలిటీలో దాదాపు 70 వేల ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారనున్నాయి.

First Published:  27 Oct 2023 5:12 AM GMT
Next Story