హైదరాబాద్‌లో ట్రావెల్స్ బస్సు బీభత్సం
ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్ వద్ద ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చి కారును కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది
BY Vamshi Kotas9 Nov 2024 10:38 AM IST

X
Vamshi Kotas Updated On: 9 Nov 2024 10:38 AM IST
హైదరాబాద్ ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్ వద్ద ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చి కారును ఢీకొట్టి..కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. వాహనదారులు, జనం ఒక్కసారిగా కేకలు వేయడంతో కారు నుంచి బయటకు దూకి డ్రైవర్ ప్రాణాలు దక్కించుకున్నాడు. అనంతరం కారు డ్రైవర్ స్థానిక పోలీసులకు ట్రావెల్ బస్సు డ్రైవర్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.అయితే, ట్రావెల్ బస్సుకు బ్రేక్ చెడిపోయాయా? లేక డ్రైవర్ నిద్రమత్తులో అలా చేశాడా? లేక మద్యం సేవించి వాహనం నడిపాడా? అనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నది.
Next Story