తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు
తెలంగాణలో పలువురు డిప్యూటీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో 47 మంది డిప్యూటీ కలెక్టర్ల, 24 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లును బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల అదనపు కలెక్టర్లు, 4 జిల్లాల డీఆర్వోలు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టిన రోజునే ఏకంగా 70 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు.
ఇటీవల రెవెన్యూ సంఘాలు పదోన్నతులు, బదిలీలపై మంత్రికి మొర పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పార్క్ పాలనను ప్రారంభించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో బదిలీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పలువురు అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, భూ సేకరణ అధికారులు, సివిల్ సప్లయిస్ వంటి శాఖల్లో పని చేస్తున్న వారిని బదిలీ చేశారు.